SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

2027 Long Weekends: 2027లో ఉద్యోగులకు తీవ్ర నిరాశ..ప్రధాన పండుగలన్నీ వారాంతపు సెలవుల్లోనే!

Public Holidays 2027 Long Weekends: సాధారణంగా కొత్త ఏడాది ప్రారంభం అవ్వగానే స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీకి చెందిన ఉద్యోగులు మొదటగా పరిశీలించేది పండుగ సెలవుల జాబితానే. రాబోయే ఏడాదిలో లభించే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్‌ను బట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వారివారి విహారయాత్రలను ప్లాన్ చేస్తుంటారు. అయితే వచ్చే ఏడాది అనగా 2027లో సెలవుల జాబితా తీవ్రంగా నిరాశను కలిగించింది. ఎందుకంటే వచ్చే సంవత్సరం ప్రధాన పండుగలు, జాతీయ దినోత్సవాలు వంటి పబ్లిక్ హాలీడేస్ అన్నీ వీకెండ్‌లో కలిసిపోయాయి. ఈ క్రమంలో ఉద్యోగులు తమ పర్సనల్ లీవ్స్ అనేవి చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది.

Written By Harish Darla
Published: Oct 04, 2026, 01:04 PM IST | Updated: Oct 04, 2026, 01:07 PM IST
Join

Public Holidays 2027 Long Weekends: ప్రతి ఏటా సోమవారం లేదా శుక్రవారం రోజుల్లో పబ్లిక్ హాలిడే వస్తే.. శని, ఆదివారాలతో కలిపి వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘ వారాంతపు సెలవు (లాంగ్ వీకెండ్) దక్కేది. ఇలాంటి సమయాల్లోనే సమయాల్లో ఉద్యోగులు తమ టూర్ ప్లానింగ్ చేస్తుంటారు. సొంతూళ్లు వెళ్లడం లేదా సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు.

అయితే, రాబోయే ఏడాది 2027 క్యాలెండర్ వివరాలను పరిశీలిస్తే ఉద్యోగులకు అటువంటి ప్రత్యేక లాంగ్ వీకెండ్స్ లభించే అవకాశం అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాదిలోని చాలా ముఖ్యమైన పండుగలు నేరుగా వీకెండ్స్‌లోనే వస్తుండడం గమనార్హం.

2027లో వారాంతాల్లో వచ్చే ప్రధాన పండుగలు, సెలవుల జాబితా..
మహా శివరాత్రి: మార్చి 6 (శనివారం)
మహారాష్ట్ర డే (ప్రాంతీయ సెలవు): మే 1 (శనివారం)
స్వాతంత్ర్య దినోత్సవం: ఆగస్టు 15 (ఆదివారం)
వినాయక చవితి: సెప్టెంబర్ 4 (శనివారం)
గాంధీ జయంతి: అక్టోబర్ 2 (శనివారం)
దసరా పండుగ: అక్టోబర్ 9 (శనివారం)
గురునానక్ జయంతి: నవంబర్ 14 (ఆదివారం)
క్రిస్మస్ పండుగ: డిసెంబర్ 25 (శనివారం).

ఈ విధంగా వచ్చే ఏడాదికి సంబంధించిన వీకెండ్ సెలవులు జాబితాతో కూడిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2027 సంవత్సరంలో తమ సెలవుల ప్లానింగ్ చేయడం ఎంతో కష్టమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ సెలవుల ప్రభావం ప్రధానంగా సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేసే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులపైనే ఎక్కువగా పడనుందని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా కొన్ని సంస్థల్లో వారాంతపు రోజులలో పబ్లిక్ హాలిడే వస్తే, ప్రత్యామ్నాయంగా 'కాంపెన్సేటరీ ఆఫ్‌' (Compensatory Off) ఇచ్చే విధానం అమలులో ఉంటుంది. అయితే, అన్ని కంపెనీలలో ఈ వెసులుబాటు ఉండకపోవచ్చు. దీంతో ఉద్యోగులు తమ విహార యాత్రలు, వ్యక్తిగత పనుల కోసం క్యాజువల్ లేదా ఎర్న్‌డ్ లీవ్స్ (Casual/Earned Leaves) ఎంతో జాగ్రత్తగా, సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES