SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. నెరవేరనున్న ఉద్యోగుల డీఏ, డీఆర్ డిమాండ్లు..!

8th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా, వేతన సవరణకు సంబంధించి ఉద్యోగ సంఘాలు అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. తాజాగా ప్రభుత్వం డీఏను ఉద్యోగుల శాలరీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 07:44 AM IST | Updated: Oct 19, 2026, 07:48 AM IST
Image Credit: 8th Pay commission Update (File Pic/Source)
Join

DA DR Merge With Salary: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)లను బేసిక్ శాలరీ, బేసిక్ పింఛనుతో విలీనం చేయడం, నిరంతర వేతన సవరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసే అధికారాన్ని ఇవ్వడం వంటివి ప్రభుత్వం ముందు ఉద్యోగులు ఉంచిన డిమాండ్లు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  అందువల్ల, ఉద్యోగులు,పింఛనుదారులు ఈ డిమాండ్లను ఫైనల్ అని భావించకూడదు.

FNPO
జాతీయ తపాలా సంస్థల సమాఖ్య (FNPO) కరువు భత్యం లేదా కరువు సహాయాన్ని 100% పెంచనున్నట్లు తెలిపింది. 25 శాతం పరిమితిని దాటినప్పుడు, దానిని మూల వేతనం లేదా మూల పింఛనుతో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకోవడంలో ఉద్యోగులకు, పింఛనుదారులకు సహాయపడటమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.

ద్రవ్యోల్బణం తగ్గించడానికి కరువు భత్యం.. 
సాధారణంగా, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  కరువు భత్యం ఇస్తుంటారు. దీనిని మూల వేతనంలో విలీనం చేయడం వల్ల జీతంలో పెద్ద మార్పు రావచ్చు. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి డెషిషన్  తీసుకోలేదు. ప్రతిసారీ కొత్త వేతన సంఘం ఏర్పడే వరకు వేచి ఉండకుండా, క్రమం తప్పకుండా వేతన సవరణలు చేయడానికి ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎఫ్‌ఎన్‌పిఓ (FNPO) మరో ముఖ్యమైన డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చింది.

ఈ ప్రతిపాదన ప్రకారం, కరువు భత్యం లేదా కరువు సహాయం 50 శాతం స్థాయికి చేరిన 90 రోజుల్లోపు కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వేతన, పింఛను సవరణలను సకాలంలో చేపట్టవచ్చని భావిస్తున్నారు. అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారా లేదా అనేది చూడాలి. ఒక వేళ చేస్తే దానికి ఏ అధికారాలు ఇస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు.

కరువు భత్యం 25 శాతం దాటితే.. 
కరువు భత్యం 25% దాటినప్పుడు దానిని మూల వేతనంలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పెన్షనర్ల సంఘమైన భారత్ పెన్షనర్స్ సమాజ్ కూడా కోరింది.

దీనికి అదనంగా, పెన్షనర్ల సంఘం 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించింది. కొత్త వేతన విధానంలో పాత మూల వేతనం లేదా మూల వేతనాన్ని సవరించడానికి ఉపయోగించే గుణకాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఈ గుణకం ఆధారంగా కొత్త మూల వేతనం లేదా వేతనాన్ని లెక్కిస్తారు. అయితే, 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం ఆమోదించిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇది కేవలం ఆ సంస్థ యొక్క డిమాండ్ మాత్రమే, అధికారికంగా ధృవీకరించలేదు.  

కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. 8వ వేతన సంఘం అక్టోబర్ 22, 23 తేదీలలో ముంబైలో ఓ సమావేశాన్ని నిర్వహించాలనే ఆలోచన చేస్తుంది.  ఈ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు తమ డిమాండ్లను నివేధించే అవకాశం ఉంది. నవంబర్ 3, 2025న 8వ వేతన సంఘం ఏర్పడినప్పటి నుండి, ఢిల్లీ, లడఖ్, పశ్చిమ బెంగాల్, చెన్నై,  పుదుచ్చేరితో సహా వివిధ ప్రాంతాలలో సమావేశాలు జరిగాయని నివేదిక పేర్కొంది.

8వ వేతన సంఘం ద్వారా మూల వేతనం,  పెన్షన్‌లో ఎంత పెరుగుదల ఉంటుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కరువు భత్యం విలీనం ఇతర డిమాండ్లపై తుది నిర్ణయం ప్రకటించే వరకు ఖచ్చితమైన వేతన పెంపును లెక్కించలేమంటున్నారు.

ముఖ్యంగా, కరువు భత్యం (DA) లేదా కరువు ఉపశమనం (DR) 25% మించినప్పుడు దానిని బేసిక్ శాలరీ లేదా పెన్షన్‌లో విలీనం చేయడం, శాశ్వత వేతన సవరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం.. 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడం వంటివి ఉద్యగులు, పెన్షనర్ల ప్రస్తుత డిమాండ్లు. వీటికి ప్రభుత్వ ఆమోదం లభిస్తేనే ఉద్యోగులు, పెన్షనర్ల ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ఈ డిమాండ్ల భవిష్యత్తును నిర్ణయించడంలో 8వ వేతన సంఘం యొక్క తదుపరి సమావేశాలు, అధికారిక సిఫార్సులు కీలక పాత్ర పోషించనున్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES