Andhra Pradesh Weather Update:ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమకు వాతావరణ శాఖ మంచి శుభవార్త అందించింది. కోస్తాంధ్ర, తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతం, కర్ణాటకలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. దానితో పాటు ఉపరితల ద్రోణి కూడా విస్తరించినట్లు తెలిపింది.
ఈ నెల 22 వరకు వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, రాష్ట్రంలో ఈ నెల 22 వరకు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని సూచించింది. ఈ రోజు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల మీదుగా అన్నమయ్య, కడప, ప్రకాశం నుంచి కాకినాడ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు..
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు, మత్య్సకారులు మరింత జాగ్రత్తగా అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి ఋతువపనాలు ముగిసాయి. అక్టోబర్ సీజన్‌లో ఈశాన్య ఋతు పననాలతో పాటు బంగాళాఖాతంలో ఈ సమయంలో ఏర్పడే అల్ప పీడనాలు తుపానుగా మారి వర్షాలు కురుస్తుంటాయి. మొత్తంగా కరువు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే సమాచారం ఈ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.