Delhi: ఢిల్లీలో పెను విషాదం.. క్లాసులో అకస్మాత్తుగా కుప్పకూలిన 9 ఏళ్ల బాలిక.. వీడియో వైరల్..
Girl collapse in class Delhi: స్కూల్ లో క్లాసులు బోధిస్తుండగానే బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది బాలికను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
9 year old girl dies after collapsing in class room delhi: ప్రస్తుతం చాలా మంది ఉరుకులు, పరుగుల జీవనం సాగిస్తున్నారు. సమయానికి తిండి తినకుండా, కంటి నిండా నిద్రలేకుండా గడిపేస్తున్నారు. కొంత మంది ఉద్యోగులు రాత్రిపూట సైతం షిఫ్ట్ లు చేస్తున్నారు. దీంతో జీవగడియారంలో అనేక మార్పులు వచ్చి కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వారికి వరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురౌతున్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని సిట్యువేషన్ ఏర్పడింది.ఈ క్రమంలో కొంత మంది అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. నిల్చున్న ప్రదేశంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
తాజాగా.. ఢిల్లీలోని స్కూల్లో ఒక తొమ్మిదేళ్ల బాలిక క్లాసు జరుగుతుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కుప్పకూలీ పడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని లవ్లీ పబ్లిక్ స్కూల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక క్లాసులో పాఠాలు వింటుంది. ఇంతలో ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలీ పోయింది. వెంటనే ఆమెకు కొంత మంది క్లాసులో పీసీఆర్ కూడా చేశారు.
కానీ ఆ బాలికలో ఎలాంటి చలనం కూడా లేదు. దీంతో వెంటనే సిబ్బంది నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ రెడిక్స్ హెల్త్ కేర్‌కు తరలించారు. ఈ క్రమంలో బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే బాలిక మృతికి గల ఖచ్చితమైన కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. కొంత మంది మాత్రం ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు చెబుతున్నారు. దీనిపై పోస్ట్ మార్టం నివేదిక వస్తే అసలు కారణం తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.