• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

Monsoon Rains: ద్రపు నీరు సంవత్సరం పొడవునా ఆవిరవుతూనే ఉంటుంది. కానీ వర్షాలు మాత్రం జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలే పడతాయి. మిగతా ఎనిమిది నెలలు వర్షాలు ఎందుకు కురవవు?

Written ByBhoomi
Published: Nov 04, 2026, 05:24 PM IST|Updated: Nov 04, 2026, 05:27 PM IST
joinshare
వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!
Image Credit: Monsoon Rains

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే  మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

Dhanteras 2026: ధన త్రయోదశి రోజు బంగారం, వెండికాదు.. ఈ ఒక్కటి కొంటే మీ ఇంట్లో ఎప్పటికి తరగని సిరుల పంట.!.

2

Kwala Intel: అత్యుత్తమ స్మార్ట్ మార్కెట్ పరిశోధనకు క్వాలా ఇంటెల్ సూచించే 7 కీలకమైన అంశాలు ఇవే!

3

Hyderabad: హైదరాబాద్ హస్టళ్లలో నీళ్ల కష్టాలు.. వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిర్వాహకుల నిరసన..

4

వర్షాలు వర్షాకాలంలోనే ఎందుకు పడతాయి ? దీని వెనుక ఉన్న వాతావరణ రహస్యాలు మీకోసం..!!

5

ఈ దీపావళికి ఇంట్లోనే ఈజీగా జ్యూసీ బూంది లడ్డు చేయండిలా.. రెసిపీ ఇగో..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Monsoon Rains: ద్రపు నీరు సంవత్సరం పొడవునా ఆవిరవుతూనే ఉంటుంది. కానీ వర్షాలు మాత్రం జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలే పడతాయి. మిగతా ఎనిమిది నెలలు వర్షాలు ఎందుకు కురవవు? నిజానికి సూర్యుడి వేడికి సముద్రపు నీరు ప్రతిరోజూ ఆవిరవుతుంది. అయితే కేవలం నీటి ఆవిరి ఉన్నంత మాత్రాన వర్షం పడదు. ఆ ఆవిరిని భూమి వైపు నడిపించే ఒక శక్తి అవసరం.

భూమిపై అల్పపీడనం.. సముద్రంపై అధిక పీడనం:

ఏప్రిల్, మే నెలల్లో భూమి వంపు వల్ల సూర్యకిరణాలు భారతదేశంపై నిట్టనిలువుగా పడతాయి. దాంతో నేల ఒక కొలిమిలా మారి విపరీతంగా వేడెక్కుతుంది. ఆ వేడికి భూమిపై ఉన్న గాలి తేలికై పైకి లేచిపోతుంది. దీనివల్ల నేలపై గాలి తగ్గిపోయి ఒక భారీ అల్పపీడనం (వాక్యూమ్) ఏర్పడుతుంది.

అదే సమయంలో నేలతో పోలిస్తే హిందూ మహాసముద్రం చల్లగా ఉంటుంది. దానివల్ల సముద్రం పైన గాలి బరువుగా ఉండి అధిక పీడనం ఏర్పడుతుంది. ప్రకృతి నియమం ప్రకారం గాలి ఎప్పుడూ అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు వేగంగా వీస్తుంది. దాంతో సముద్రం మీదున్న తేమ గాలులన్నీ ఒక్కసారిగా దేశం వైపు దూసుకొస్తాయి. వీటినే 'నైరుతి ఋతుపవనాలు' అంటారు.

పర్వతాల అడ్డుగోడ.. కుండపోత వర్షాలు:

సముద్రం నుంచి వచ్చిన ఈ బరువైన మేఘాలను పశ్చిమ కనుమలు, హిమాలయ పర్వతాలు అడ్డుకుంటాయి. దాంతో ఆ మేఘాలు మరింత పైకి లేచి చల్లబడి జూన్ నుండి సెప్టెంబర్ వరకు కుండపోత వర్షాలుగా కురుస్తాయి.

చలికాలంలో రివర్స్ సీన్:

శీతాకాలంలో సముద్రం కంటే నేలే త్వరగా చల్లబడిపోతుంది. అప్పుడు పరిస్థితి తలకిందులై, గాలులు నేల నుండి సముద్రం వైపు వీస్తాయి. నేల మీద నుండి వీచే ఈ గాలుల్లో నీటి ఆవిరి ఉండదు. తేమ లేని ఈ పొడి గాలుల వల్ల ఆకాశంలో వర్షపు మేఘాలు ఏర్పడవు. అందుకే మిగతా కాలాల్లో వర్షాలు పడవు.

ఎండాకాలంలో నేల ఎంత గట్టిగా కాలితే, వర్షాకాలంలో అంత సమృద్ధిగా నీటిని మోసుకొస్తుంది. ఇది ప్రకృతి రూపొందించిన అద్భుతమైన వాతావరణ ఇంజిన్.

Also Read: 

 

శత్రువుల గురువు దగ్గర విద్య నేర్చుకున్న కచుడు.. శుక్రాచార్యుడి నుంచి పొందిన జ్ఞానం వెనుక అసలు కథ ఇదే!

 

అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
National News