SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ నేతలు విడుదల.. ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్..

CJP Protest in Delhi: ఢిల్లీ మరోసారి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈక్రమంలో సీజేపీ నేత అజింక్య శిందే ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద ఈ రోజు కూడా నిరసనలు జరుగుతాయని వెల్లడించారు. ఈక్రమంలో ఢిల్లీ కంటోన్మెంట్ కోర్టు పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు సీజేపీ నేతలను విడుదల చేస్తు ఆదేశాలు జారీ చేసింది.

Written By Inamdar Paresh
Published: Oct 11, 2026, 11:16 AM IST | Updated: Oct 11, 2026, 12:39 PM IST
Image Credit: Abhijeet Dipke two other released
Join

Abhijeet Dipke and Sourav das and Ashutosh Ranka released by court: దేశ రాజధాని ఇప్పటికి నివురు కప్పిన నిప్పులా ఉంది. ఇప్పటికే పోలీసులు ఢిల్లీని అష్టదిగ్బందం చేశారు.  అంతేకాకుండా వేలాదిగా పోలీసులు ఢిల్లీని అణువణువా పహారా కాస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ తో నిన్న దేశ వ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ కార్కకర్తలు ఢిల్లీకి వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. 

ఈ క్రమంలో పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఏడంచెల్లో భద్రత చేపట్టారు. మొత్తంగా ఢిల్లీని 20 జోన్లుగా విభజించారు. ఎక్కడికక్కడ నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముంబైనుంచి ఢిల్లీకి వచ్చి సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేతో పాటు మరో ఇద్దరిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే మహిళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ  రోజు ఢిల్లీ కంటోన్మెంట్ లోని అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ (ఏసీఎం) ముందు హజరుపర్చారు.

 దీనిపై విచారణ చేపట్టిన  కోర్టు వీరిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో అభిజిత్ దీప్కే,   సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను కోర్టు విడుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా కోర్టు తన ఉత్తర్వుల్లో.. ఈ ముగ్గురిని ఏడాది పాటు శాంతియుతంగా, మంచి ప్రవర్తనతో మెలగాలనే  కండీషన్ పెట్టింది. రూ.50,000 పూచీకత్తుతో కూడిన బెయిల్ బాండ్‌పై వారిని విడుదల చేసినట్లు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

 మరోవైపు రెండో రోజు కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతాయని ఇప్పటికే సీజీపీ ప్రకటించింది.  ఈ క్రమంలో పోలీసులు రైల్వేలు, విమానాలు, మెట్రోలు.. మొదలైన చోట్ల పటిష్టమైన బందో బస్తు చేపట్టింది. సోషల్ మీడియాలో నిఘా పెట్టారు. ఢిల్లీ అంతట తమ ఆధీనంలో తీసుకుని కాక్రోచ్ నిరసనల వేళ మళ్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES