టెలికాం వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక. మీరు ఎయిర్టెల్ సిమ్ కార్డు వాడుతున్నట్లయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకోండి. ఎయిర్టెల్ రూ.2049 ప్లాన్లో మొత్తం 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది, కానీ ఇందులో అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని రద్దు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
ఎయిర్టెల్ వినియోగదారులు
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ వినియోగదారులు చాలా మంది ఉన్నారు. ఈ ప్రైవేట్ టెలికాం దిగ్గజం వివిధ ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. తాజాగా ఎయిర్టెల్ రూ.2049 ప్లాన్లో 365 రోజుల వ్యాలిడిటీని అందించింది కానీ, అన్లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్ను మాత్రం తొలగించింది.
2/5
ఎయిర్టెల్
వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగానే గమనించాలి. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఏడాది రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, తొందరపడి రూ.2049 ప్లాన్ను రీఛార్జ్ చేసుకునే ముందు తెలుసుకోండి. ఎందుకంటే ఈ ప్లాన్లో మీకు 5G బెనిఫిట్ లభించదు.
3/5
ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్
రూ.2049 తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 4GB డేటా మాత్రమే లభిస్తుంది. అలాగే 3600 SMSలతో పాటు 365 రోజుల వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే, మీరు రూ.4000 విలువైన అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ప్లాన్ను 12 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.
4/5
ఎయిర్టెల్ 365 రోజుల ప్లాన్
వీటితో పాటు ఎయిర్టెల్ సేఫ్ నెట్వర్క్ ఎక్స్ట్రీమ్ ప్లే బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అయితే, ఇందులో 5G డేటా బెనిఫిట్ ఉండదని గుర్తుంచుకోండి.
5/5
ఎయిర్టెల్ ఇయర్లీ ప్లాన్స్
ఒకవేళ మీకు మొబైల్ డేటా అవసరం లేకపోతే, ఎయిర్టెల్ రూ.1849 ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాలింగ్, 3600 SMSలను అందిస్తుంది, కానీ ఇందులో డేటా బెనిఫిట్ లభించదు.