• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!

iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!

Amazon Smartphone Deals: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా iQOO స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త.. iQOO 15, iQOO 15R స్మార్ట్‌ఫోన్స్‌పై దిమ్మతిరిగే ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌పై లభిస్తున్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 01:21 PM IST|Updated: Oct 09, 2026, 01:23 PM IST
joinshare
iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

2

Bihar: బీహర్‌లో షాకింగ్.. కష్టపడి భార్యను పోలీసు చేసిన భర్త.. మహిళ చేసిన పనికి లబో దిబో.!.

3

iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!

4

Vijaya Sai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి.. కొత్తపార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు..

5

Google Pixel 10aపై ఫ్లిప్‌కార్ట్ బంపర్‌ ఆఫర్.. ఏకంగా రూ.6,200 వరకు డిస్కౌంట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amazon iQOO Smartphone Deals: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరలోనే మంచి మంచి స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల చేయడంతో చాలా మంది ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన iQOO 15, iQOO 15Rలపై అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించి యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. ప్రత్యేక సేల్ సందర్భంగా ఈ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌పై దాదాపు రూ.8,000 వరకు భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉండడం విశేషం. అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లు, అత్యాధునిక డిస్‌ప్లేలు, ఏకంగా 7,600mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్లు సాంకేతిక ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఆఫర్స్‌ వివరాలు ఇవే..
అమెజాన్ ప్రత్యేక  Amazon Great Indian Festival సేల్‌లో భాగంగా ఇన్స్టంట్ ప్రైస్ కట్‌తో పాటు, ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్‌తో పాటు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.. అంతేకాకుండా భారీ తగ్గింపు పొందాలనుకునేవారికి పాత ఫోన్ చేస్తే భారీగా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తూ వస్తోంది. దీంతో పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లతో కలిపి మొత్తం రూ.8,000 వరకు స్పెషల్ డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది.. అంతేకాకుండా దీనిపై మరిన్ని ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆఫర్స్‌ లోకేషన్‌ బట్టి చేంజ్‌ అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్‌ వివరాలు..
రెండు ఫోన్లలోనూ అద్భుతమైన 2K రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ (AMOLED) డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో హై-ఎండ్ గేమింగ్ ఆడేవారికి.. మల్టీమీడియా కంటెంట్ చూసేవారికి స్క్రీన్ ఎంతో వేగంగా, స్మూత్‌గా స్క్రోలింగ్‌ అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.. మల్టీటాస్కింగ్ కోసం.. ఇందులో కంపెనీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ టాప్-ఎండ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా అందించింది. అలాగే ఐకూ సొంత సూపర్ కంప్యూటింగ్ గేమింగ్ చిప్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లను కూడా సులభంగా ఆడోచ్చు..

ఈ సిరీస్‌లో కంపెనీ మోస్ట్ వపర్‌ఫుల్‌ 7,600mAh బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఈ బ్యాటరీ రోజంతా ఫోన్‌ చూసేవారికి సులభంగా సరిపోతుందని కంపెనీ తెలిపింది.. అంతేకాకుండా, కొద్ది నిమిషాల్లోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసేందుకు హై-స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులో ఓఐఎస్ (OIS) సపోర్ట్ కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందించింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News