Married woman Extra marital affair in Katihar bihar: ఇటీవల సమాజంలో కొంత మంది పెళ్లిళ్లు చేసుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ కాపురంలో నిప్పులు పోసు కుంటున్నారు. కట్టుకున్నవారిని కాటికి పంపడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని చోట్ల భర్త తన భార్యను చంపితే, మరికొన్ని చోట్ల భర్య తన భర్తను హతమారుస్తున్నారు. కొంత మంది కష్టపడి తమ భార్యలను చదివిస్తే భార్యలను ఉద్యోగం సాధించిన తర్వాత కట్టుకున్నవారిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో బీహర్ లోని కతిహర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
బీహర్ లో కైమూర్ కు చెందిన హన్స్‌లాల్ గుప్తా, యూపీకి చెందిన ప్రతిభ విశ్వకర్మ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లిని హన్స్‌లాల్ ఫ్యామిలీ అంగీకరించడంతో.. 2024లో కైమూర్ కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే పెళ్లి తర్వాత ప్రతిభ తనకు ఉన్నత చదువులు చదువుకోవాలనుందని చెప్పడంతో.. మామ పరమహంస్ గుప్తా, భర్త హన్స్‌లాల్ ఆమెకు సపోర్ట్ చేశారు.
ఈ-రిక్షా నడిపి.. రూ.8-9 లక్షలు ఖర్చు చేసి.. ప్రతిభను చదివించారు. ఈ క్రమంలో ప్రతిభ
బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. కతిహార్ జిల్లాలోని మన్సాహి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా నియామకం అయ్యింది. అయితే జాబ్ వచ్చాక ప్రతిభ ప్రవర్తనలో విపరీతంగా మార్పు వచ్చింది. భర్తను దూరం పెట్టింది.
రాహుల్ శర్మ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని హన్స్‌లాల్ కుటుంబం గుర్తించారు. ప్రతిభ తన పెళ్లిపై మాటమార్చి తనను బలవంతంగా ఈ పెళ్లి చేశారని చెప్పింది. దీంతో భర్త హన్స్ లాల్ దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
భార్య తీరుతో విసిగిపోయి.. కతిహార్ ఎస్పీ పరిచయ్ కుమార్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశాడు. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి.. మహిళా పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు మహిళ భర్త హన్స్ లాల్ చెప్పాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.