• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Vijaya Sai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి.. కొత్తపార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు..

Vijaya Sai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి.. కొత్తపార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు..

Vijaya Sai Reddy Visits Tirumala: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీలోకి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణను ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 09, 2026, 01:05 PM IST|Updated: Oct 09, 2026, 01:11 PM IST
joinshare
Vijaya Sai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి.. కొత్తపార్టీపై  ఆసక్తికర వ్యాఖ్యలు..
Image Credit: vijayasaireddyvisitstirupathi

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

2

Bihar: బీహర్‌లో షాకింగ్.. కష్టపడి భార్యను పోలీసు చేసిన భర్త.. మహిళ చేసిన పనికి లబో దిబో.!.

3

iQOO 15, iQOO 15Rపై అమెజాన్ సేల్ ఆఫర్లు.. ఏకంగా రూ.8,000 వరకు తగ్గింపు!

4

Vijaya Sai Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి.. కొత్తపార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు..

5

Google Pixel 10aపై ఫ్లిప్‌కార్ట్ బంపర్‌ ఆఫర్.. ఏకంగా రూ.6,200 వరకు డిస్కౌంట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Former mp Vijaya Sai Reddy Visits Tirumala temple: మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు కాలినడకన వెళ్లిన విజయసాయి రెడ్డి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త పార్టీ తొందరలో అనౌన్స్ చేస్తానని ప్రకటించారు. అంతే కాకుండా.. తన కొత్త పార్టీలోకి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణను ఆహ్వానించారు. 

మరోవైపు ఓవీ రమణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అలాగే రమణ, విజయసాయిరెడ్డి కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విజయసాయి రెడ్డి తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతే కాకుండా వైసీపీ అధినేత జగన్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆలయాల్లో వెళ్లి తీర్థం, ప్రసాదం తీసుకున్నట్లు నటిస్తారని మండిపడ్డారు. జగన్ ను క్రిస్టియన్ వదిలేసి హిందూ మతం స్వీకరించాలని డిమాండ్ చేశారు.

అయితే తాజాగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి రెడ్డి ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్టీలకు తమ కొత్త పార్టీ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. నూతన పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చానట్లు విజయసాయిరెడ్డి వెల్లడంచారు.  జీయర్ స్వామి, పీఠాధిపతుల అభీష్టం మేరకు వేయికాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కలిసి విజయం సాధిస్తామన్న విజయసాయిరెడ్డి తెలిపారు. తన ఆప్తమిత్రుడు రమణతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా భావసారూప్యతతో కలిసి పనిచేశామని మాట్లాడారు. 

నా నూతన రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి రావాలని రమణను ఆహ్వానించినట్లు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సే మా ప్రధాన లక్ష్యమన్నారు. 2004–2006 నుంచి కొనసాగుతున్న మా అనుబంధం చిరకాలం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటమే తమ ప్రధాన  కర్తవ్యమని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Tirupathi
TTD News