• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

Hamuman Ansh Telugu movie Review: సరిగ్గా రెండు నెలల క్రితం ఆగష్టు 7న విడుదలైన ‘హనుమాన్ అంశ్’ సినిమా బాలీవుడ్‌లో పెద్ద కేస్ స్టడీ అనే చెప్పాలి. మొదటి రెండు వారాలు ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మూడో వారం నుంచి ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం మొదలై బాలీవుడ్‌లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 09, 2026, 02:28 PM IST|Updated: Oct 09, 2026, 02:31 PM IST
joinshare
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
Image Credit: Hanuman Ansh Telugu Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Nobel Peace Prize 2026: ట్రంప్‌కు బిగ్ షాక్..  భారత సంతతి మహిళను వరించిన నోబెల్ శాంతి బహుమతి..!

Nobel Peace Prize 2026: ట్రంప్‌కు బిగ్ షాక్.. భారత సంతతి మహిళను వరించిన నోబెల్ శాంతి బహుమతి..!

2

India vs West Indies 2nd T20: రాంచీలో విండీస్‌తో రెండో సమరానికి సై.. తుది జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

3

ఎంత పెద్ద సమస్య అయినా.. తెలివి ఉంటే చాలు.. తేలికగా సాధించవచ్చని చెబుతున్న.. ముగ్గురు స్నేహితుల నీతి కథ..!!

4

200MP కెమెరాతో Vivo X500 సిరీస్ లాంచ్‌కు సిద్ధం? అక్టోబర్ 27న విడుదల!

5

‘హనుమాన్ అంశ్’ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hanuman Ansh Telugu Audience Response: కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిత్రం .. మొదటి రెండు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. పెద్ద స్టార్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు. టాప్ మోస్ట్ డైరెక్టరా అంటే అది కాదు. విడుదలైన మూడు వారాలకు  మెల్లగా మొదలైన మౌత్ టాక్.. దావానంలా వ్యాపించి బాలీవుడ్ బాక్సాఫీస్‌ దగ్గర దాదాపు రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ (రూ. 200 కోట్లకు పైగా షేర్) రాబట్టింది. ఓ రకంగా నిర్మాతకు పెట్టిన పెట్టుబడికి 100 రెట్లకు పైగా లాభాలు. ఈ మధ్యకాలంలో మొదటి మూడు రోజులకే సినిమాలు టపా కట్టేస్తున్న వేళలో ఈ సినిమా మూడో వారం నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులను థియేటర్స్ వైపు అడుగువేసేలా చేసింది. ఇంతకీ ప్రేక్షకులను  అంతగా మెప్పించేలా ఈ సినిమాలో ఏముందో చూద్దాం.


కథ విషయానికొస్తే..

‘హనుమాన్ అంశ్’ కథ విషయానికొస్తే.. 1964లో ప్రారంభమైవుతుంది. అక్కడ రామ్ నంద్ భోంస్లే (చందన్ ఆనంద్) తన మనవడికి నీమ్ కరోలి బాబా అలియాస్ లక్ష్మీ నారాయణ శర్మ (శోభినన్ సత్య) కథ చెబుతాడు. ఈ నేపథ్యంలో నీమ్ కరోలి బాబా ఎవరు..? నాస్తికుడిగా ఉన్న రామ్ నంద్ భోంస్లే ఎలా ఆస్తికుడుగా మారి నీమ్ కరోలి బాబా  శిష్యుడు ఎలా అయ్యాడు. లక్ష్మీ నారయణ్ ఎందుకు నీమ్ కరోలి బాబాగా ఎలా మారారు. ఆయన చూపిస మహిమలు ఏమిటి.. ? భక్తులకు ఎలా అనుగ్రహించారు. మొత్తంగా ఈయన జీవనంలో చోటు చేసుకున్న వివిధ దశలు, పరిణామాలు ఏమిటనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. ఆయన జీవితం చూస్తుంటే గురు రాఘవేంద్ర స్వామి, శిరిడి సాయి బాబా  జీవితాలు లీలగా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాల్యంలో తల్లి చనిపోవడంతో ఓ రకమైన విరక్తి చెందుతాడు. ఎపుడు తపస్సు ధ్యానంలో గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లోంచి గుజరాత్ .. అలా దక్షిణ భారత దేశానికి వెళ్లి తిరిగి ఉత్తరాఖండ్‌లో నీమ్ కరోలి అనే ఊరిలో సెటిల్ అయ్యే క్రమంలో ఆయన చూపించిన మహిమలు, భక్తులను ఎలా కాపాడారనేది ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందనేది చెప్పాలి. ముఖ్యంగా స్వాతంత్య్రం పూర్వం కాలం నాటి ఇళ్లు.. అక్కడ ప్రజల వేష భాషలు, అప్పటి సామాజిక పరిస్థితులు తెరపై అద్భుతంగా చూపించాడు. నిజంగా ఆ కాలంలోకి ప్జలను తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.

నీమ్ కరోలి బాబా మహిమల విషయానికొస్తే.. ముఖ్యంగా గుజరాత్‌లో పశు, పక్ష్యాదులతో సంభాషించడం. ముఖ్యంగా తనపై రాళ్లు వేసిన పిల్లకు మిఠాయిలు తిరిగి ఇవ్వడం వంటి మహిమలు ప్రేక్షకులు ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు బాబాను రైళ్లల్లోంచి కిందికి దింపేయడం.. ఆ తర్వాత అది కదలకపోవడం.. ఆ తర్వాత బ్రిటిష్ అధికారి తన తప్పు తెలసుకొని ఆయన ప్రాథేయ పడటంతో ట్రైన్ కదలడం సీన్స్‌తో బాబా మహిమా ఎలాంటిదో చూపెట్టారు. ఓ సీన్ లో బాబాపై కొన్ని పాములు పాకుతూ పరమ శివుడిలా కనిపించే సీన్స్ ప్రేక్షఖులు థియేటర్స్‌లో చూస్తేనే ఆ మజా వస్తుంది.

అటు ఇంకో ముస్లిమ్ పోలీస్ అధికారి.. బాబాను దొంగ అనుకొని జైల్లో ఉంచడం.. అతను తాళం ఉన్న బయటకు వెళ్లి ఆ పోలీస్ అధికారి కళ్లు తెరిపించడం.. ఆ ముస్లిమ్ అధికారి బాబా శిష్యుడు కావడం..  సీన్స్ హైలెట్స్. అటు నాస్తికుడును ఆస్తికులుగా మార్చడం. ఓ మహిళకు తన భర్త చనిపోతాడని చెప్పి.. అతన్ని రక్షించమని చెప్పడం.. వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్లడం.  అటు దొంగను మంచివాడిగా మార్చడం, భార్యకు జ్ఞానోదయం చేయడం  వంటి సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతూ ఈ సినిమాలో బాబా మహిమలు అపారం. అంతా కొత్తవాళ్లైన అంతా బాగా నటించారు. ఈ సినిమా కాస్త స్లో నేరేషన్‌తో సాగినట్టు అనిపించినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కవగా ఉత్తరాది వాళ్లకు కనెక్ట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంద చూడాలి మరి.  సినిమా చూస్తున్నంత సేపు అదో ఆధ్యాత్మిక లోకంలో విహరించడం గ్యారంటీ. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, మ్యూజిక్ , నిర్మాణ విలువలు ఇలా అన్ని విభాగాలు బాగా కుదిరాయి.

నటీనటుల విషయానికొస్తే.. 
శోభినన్ సత్య నీమ్ కరోలి బాబా అలియాస్ లక్ష్మీ నారాయణ శర్మ పాత్రలో ప్రశాంత వదనంతో కనబడ్డాడు. శంకరాభరణంతో జేవి సోమయాజులకు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో.. ఈ సినిమాతో శోభినన్ సత్యకు ఆ రేంజ్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలో ఎంతో అనుభవం ఉన్న వాడిగా కనిపించింది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులందరు తమ పాత్రల్లో జీవించారు. నీమ్ కరోలిబాబా భార్యగా.. అతని శిష్యులుగా చేసిన వాళ్లు.. బ్రిటిష్ అధికారి.. ముస్లిమ్ పోలీస్ అధికారి ఇలా ఎవరు ప్రేక్షకులకు తెలియని వాళ్లే అయిన తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

పంచ్ లైన్.. రామ్ భక్త   ‘హనుమాన్ అంశ్’..

రేటింగ్: ఇలాంటి చిత్రాలకు రేటింగ్‌తో పనిలేదు. రేటింగ్‌తో ఈ సినిమా స్థాయిని తగ్గించినట్టు అవుతుంది. ఎపుడో కానీ ఇలాంటి చిత్రాలు రావు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Bollywood
Movie Review
Telugu Movie
OTT Movies