SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Anandiben Patel Comments: "ప్రియురాలిని తల్లిని చేసి వదిలేయోద్దు" ఉత్తరప్రదేశ్ మహిళా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!

UP Governor Anandiben Patel Comments: రిలేషన్స్ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్పష్టం చేశారు. గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసిన తర్వాత ఆమెను ఒంటరిగా వదిలివేయడం చాలా పెద్ద తప్పని యువకులకు స్పష్టమైన హితవు పలికారు. యువత తొలుత ఆర్థికంగా నిలదొక్కుకుని స్వయం సమృద్ధిని సాధించాలని, బంధాలు ఏర్పరచుకుంటే తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని ఆమె తెలియజేశారు.

Written By Harish Darla
Published: Oct 23, 2026, 01:02 PM IST | Updated: Oct 23, 2026, 01:05 PM IST
Join

UP Governor Anandiben Patel Comments: ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యువత వ్యక్తిగత సంబంధాలు, సాంప్రదాయ వివాహ వ్యవస్థ అంశాలపై మరోసారి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లక్నో నగరంలోని మహర్షి యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాంగణంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత తీసుకోవాల్సిన బాధ్యతలను ఆమె ప్రముఖంగా గుర్తుచేశారు.

యువకులు ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండటంలో ఎలాంటి తప్పు లేదని, అయితే ఆ బంధం ద్వారా పిల్లల్ని కని, ఆ తర్వాత వారిని బాధ్యతారహితంగా వదిలేయడం అత్యంత అనుచితమని పేర్కొన్నారు. ఒక యువతిని గర్భవతిని చేసి తల్లిని చేసిన తర్వాత విడిచిపెట్టడం చాలా పెద్ద తప్పిదమని ఆమె స్పష్టం చేశారు.

ఎవరైనా అమ్మాయితో బంధాన్ని కొనసాగిస్తే పెళ్లి కూడా చేసుకోవాలని, అయితే అంతకంటే ముందే యువకులు తమ కాళ్లపై తాము నిలబడి స్వయం సమృద్ధిని సాధించాలని, తద్వారా తాము ఏర్పరచుకున్న సంబంధాలకు పూర్తి బాధ్యత వహించాలని హితవు పలికారు. గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సమాజంలో కొత్త చర్చకు దారితీశాయి.

గతంలో వివాదాస్పద హెచ్చరికలు..
ఆనందీబెన్ పటేల్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతంలోనూ ఆమె సహజీవన సంబంధాలు, సమాజంలో మహిళల పాత్రపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపాయి. గతేడాది అక్టోబర్ నెలలో బలియా, వారణాసి నగరాలలోని విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ సభల్లో మాట్లాడుతూ సహజీవన సంబంధాలపై యువతులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

లివ్ - ఇన్ రిలేషన్‌షిప్‌ల వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ప్రత్యక్షంగా చూడాలంటే అనాథ శరణాలయాలను సందర్శించాలని, అక్కడ పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న యువతులు కనిపిస్తారని బలియా సభలో వ్యాఖ్యానించారు. ఆ మరుసటి రోజే వారణాసిలో మాట్లాడుతూ, యువతులు సహజీవనానికి దూరంగా ఉండాలని, లేకపోతే '50 ముక్కలుగా నరికివేయబడటం' వంటి తీవ్ర హింసాత్మక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించగా, ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి.

అంతేగాక ఈ ఏడాది జులై నెలలో కాన్పూర్‌లోని మరో స్నాతకోత్సవంలో మాట్లాడుతూ మహిళలు ఐఏఎస్ అధికారులుగా లేదా ఉపాధ్యాయులుగా ఎదగడానికి ముందే 'నిపుణులైన తల్లులు'గా మారాలని గవర్నర్ సూచించారు. మహిళలు వంట నేర్చుకోవడం, తమ వృత్తి జీవితాన్ని కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకోవడం గురించి మాట్లాడగా, అవి కూడా అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

మహిళల భద్రత, సామాజిక బాధ్యత కోణంలోనే తాను ఈ సూచనలు చేస్తున్నానని గవర్నర్ చెబుతున్నప్పటికీ, ఆధునిక సమాజంలో లింగ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, యువతులు తమ జీవితంపై తీసుకునే నిర్ణయాలు వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES