• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌

YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌

YS Jagan Hot Comments On AP Local Body Elections: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అసలు ఎన్నికలు కావని.. అవి సెలక్షన్స్‌ అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. మొత్తం ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని ఎన్నికలు నడిపించారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 05, 2026, 05:28 PM IST|Updated: Nov 05, 2026, 05:30 PM IST
joinshare
YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌
Image Credit: YS Jagan Press Meet

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటన

2

యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే iPhone 18 విడుదల? ఫీచర్లు లీక్‌..

3

Ragina Cassandra: నచ్చకుంటే తప్పుకొవచ్చు.. రాధికా ఆప్టే కామెంట్స్ కు ఇచ్చిపడేసిన రెజీనా కసాండ్రా.. ఇండస్ట్రీలో రచ్చ..

4

YS Jagan: ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు గుప్పిట్లోకి తీసుకుని నడిపించాడు: వైఎస్‌ జగన్‌

5

IPL 2027: ఐపీఎల్‌ 2027లో కీలక పరిణామం.. ప్లేయర్లను ఇచ్చిపుచ్చుకున్న చెన్నై, హైదరాబాద్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan Press Meet: అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల వ్యవస్థను మొత్తం చంద్రబాబు తమ గుప్పిట్లోకి తీసుకుని ఎన్నికలు నడిపించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమర్శించారు. శకుని మాయాపాచికల్లా ఎన్నికల ప్రక్రియను రిగ్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఓల వరకు ఒక మాఫియా ముఠాలా వ్యవహరించారని.. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుకు తొత్తుగా మారడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలే విఫలమయ్యాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

'సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. నామినేషన్‌ కేంద్రాల నుంచి కౌంటింగ్‌ కేంద్రాల వరకు సీసీ కెమెరాలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. రాత్రిపూట బ్యాలెట్‌ బాక్సుల రిగ్గింగ్‌ వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం కబ్జా చేశారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు. పోలింగ్‌ బూతుల్లోకి తమ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా టీడీపీ రౌడీలతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కళ్ల ఎదుటే రిగ్గింగ్‌ జరుగుతున్నా అడ్డుకోవాల్సిన పోలీసులు దానికి సహకరిస్తే.. ఇలాంటి ఎన్నికలను అసలు ఎన్నికలు అని ఎలా అంటారు? అని మరోసారి ప్రశ్నించారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో గురువారం మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తీరును తప్పుబట్టారు. అవి ఎన్నికలేనా? అవి సెలక్షన్స్‌ అంటూ ఎన్నికల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం తీరు, పోలీస్‌ వైఖరిపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్ఆరు.

'ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్నే పూర్తిగా హైజాక్‌ చేశారు. శకుని మాయాపాచికల మాదిరిగా అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రిగ్గింగ్‌‌ చేశారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌, 143 హామీలతో ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక ఎన్నికలను హైజాక్‌ చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు.

'ఎన్నికల ప్రకటన రాగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్‌ పేరుతో పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులు, అరెస్టులతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కై అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌ పత్రాలను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం, నామినేషన్లను అడ్డగోలుగా తిరస్కరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వవరించారు.

'పోటీ నుంచి తప్పుకోవాలని బలవంతపు ఉపసంహరణలు చేయించారు.. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఓల వరకు ఒక మాఫియా ముఠాలా వ్యవహరించారు. ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా ఉండాల్సిన ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుకు తొత్తుగా మారడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలే విఫలమయ్యాయి' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో తమ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేయలేదని.. మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్‌ దశలోనే పోటీ లేకుండా చేశారని వెల్లడించారు.

'పోలీసుల కళ్ల ముందే టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఇలాంటి ఎన్నికలను అసలు ఎన్నికలు అని పిలవగలమా?' అని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు దేశానికి ఒక కేస్‌ స్టడీగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
YCP
YS Jagan Mohan Reddy
Politics
AP News
Telugu News