• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Ashaatti Ammumma Video: ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా చేసి.. చిన్నారులతో అక్షరాన్ని దిద్దిస్తున్న ఆశాత్తి అమ్మ.. వీడియో వైరల్..

Ashaatti Ammumma Video: ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా చేసి.. చిన్నారులతో అక్షరాన్ని దిద్దిస్తున్న ఆశాత్తి అమ్మ.. వీడియో వైరల్..

kerala Ashaatti Ammumma news: 85 ఏళ్ల ఇందిరమ్మ ఆశాట్టి అమ్మమ్మ ఇసుక మీదనే చిన్నారులకు పాఠాలు బోధిస్తు అందరిచే మన్ననలు పొందుతున్నారు.ఈ వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 24, 2026, 08:04 AM IST|Updated: Oct 24, 2026, 08:16 AM IST
joinshare
Ashaatti Ammumma  Video: ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా చేసి.. చిన్నారులతో అక్షరాన్ని దిద్దిస్తున్న ఆశాత్తి అమ్మ.. వీడియో వైరల్..
Image Credit: kerala Ashaatti Ammumma news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

2

శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!

3

దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

4

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటిస్తుందా..!

5

తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ashaatti Ammumma grand mother teaching classes on sand in kerala: ఇటీవల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఎంత ఫీజులైన చెల్లించి మంచి స్కూల్లో తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. వారి ఫ్యూచర్ కోసం ఎంటి త్యాగాలకైన వెనుకాడటంలేదు. ఈ క్రమంలో మారుతున్న టెక్నాలజీతో పాటు స్కూల్ లు కూడా అప్ డేట్ అవుతున్నాయి. ఒకప్పుడు స్కూళ్లలో బ్లాక్ బోర్డులు ఉండేవి. కానీ ప్రస్తుతం చాలా వరకు స్కూళ్లలో డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రతిదీ ఆన్ లైన్లో విద్యార్థులకు కావాల్సిన క్లాసులు బోధిస్తున్నారు. అయితే కేరళకు చెందిన ఒక ఆశాట్టి అమ్మమ్మ మాత్రం ఇసుక మీద పిల్లలకు పాఠాలు బోధిస్తు అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తున్నారు.

 

స్మార్ట్‌బోర్డులు లేవు.. హంగుల్లేవు.. ఇసుకతోనే పిల్లలకు పాఠాలు చెబుతున్న ఆశాత్తి అమ్మ ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా మార్చి, చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారి కలలకు బాటలు వేస్తున్న ఆశాత్తి అమ్మ నిజమైన విద్యకు హంగులు కాదు, అంకితభావమే ముఖ్యమని నిరూపిస్తున్నారు. #AshaattiAmmumma #EducationForAll #InspiringStories #TeachingWithLove

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 23, 2026

 

కేరళలకు చెందిన 85 ఏళ్ల ఆశాట్టి అమ్మమ్మ ఈ వయసులో కూడా చాలా మంది పిల్లలకు పాఠాలుబోధిస్తున్నారు. అది కూడా ఎలాంటి హంగులు, ఆడంబారాలు లేకుండా పిడికెడు ఇసులో చిన్నారులతో ఆశాట్టి అమ్మమ్మ అక్షరాలను దిద్దిస్తున్నారు.  స్థానికంగా చాలా మంది ఆశాట్టి అమ్మమ్మను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. తమ పిల్లల్ని ఆశాట్టి చెప్పే క్లాసులకు పంపుతారు. ఇంత పెద్ద వయసులో కూడా ఆశాట్టి అమ్మమ్మ స్థానికంగా తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకు క్లాసులను ఇసుక మీద బోధిస్తున్నారు. చిన్నారులు ఇసుకలో ఆడుకొవడానికి ఆసక్తి చూపిస్తారు. 

ఒకవైపు వారిని ఆడిస్తునే మరోవైపు దానిలో కూడా క్లాసుల్ని బోధిస్తు  ఆశాట్టి అమ్మమ్మ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలుసైతం ఆశాట్టి అమ్మమ్మ వద్దకు వెళ్లేందుకు తమ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు వందల మంది పిల్లలకు ఇసుక మీద ఆశాట్టి అమ్మమ్మ క్లాసులు బోధించారని అక్కడి వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేరళ బామ్మ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏదైన చేయాలనే తపన, సాధించాలని బలమైన కోరిక ఉన్నవారికి వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ లైవ్ ఎగ్జాంపుల్ అంటూ నెటిజన్లు ఆశాట్టి అమ్మమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Telugu News