SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Assam Night Club Incident: నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్ల దాడి..అమ్మాయిని నగ్నంగా నిలబెట్టి, పిడిగుద్దులతో...

Assam Night Club Incident Video: అస్సాంలోని గువాహటిలోని ఓ నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్లు అమానుషంగా ప్రవర్తించిన దారుణమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వ్చచింది. ఖానాపారా ప్రాంతంలోని ఒక కేఫ్ అండ్ లాంజ్‌లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ దాడి జరిగింది. బాధితురాలని వివస్త్రను చేసి నగ్నంగా కింద పడేసి తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Written By Harish Darla
Published: Oct 03, 2026, 05:07 PM IST | Updated: Oct 03, 2026, 05:09 PM IST
Join

Assam Night Club Incident Video: అస్సాం రాష్ట్రం గువాహటిలోని ఖానాపారా ప్రాంతంలోని 'లోకల్స్' కేఫ్ అండ్ లాంజ్ నైట్‌క్లబ్‌లో గురువారం అర్ధరాత్రి ఒక యువతిపై అమానుష దాడి జరిగింది. క్లబ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది (బౌన్సర్లు) ఈ దారుణమైన ఘటనకు పాల్పడినట్లు అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో పురుష, మహిళా బౌన్సర్లు ఇద్దరూ కలిసి ఆమెను నేలపైకి నెట్టి, దుస్తులు తొలగించి నగ్నంగా ఆమెను వేధించారని సమాచారం అందుతోంది.

వైరల్ వీడియో దృశ్యాలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం.. బాధితురాలు నేలపై దుస్తులు లేకుండా నగ్నంగా పడిఉంది. ఇద్దరు మహిళలు ఆమెపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో వారిద్దరి చుట్టూ కొందరు పురుషులు గుమిగూడి కనిపించారు. 

మరొక వీడియోలో.. ఒక మహిళ బాధితురాలిని పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా, ఒక కారు వచ్చి వారి దృశ్యాన్ని అడ్డుకోవడం కనిపిస్తుంది. అయితే ఆమెపై దాడిని ప్రతిఘటించడానికి కొందరు ప్రయత్నించినా.. బాధితురాలిపై బౌన్సర్ల దాడి ఆపలేదు.

ఆ దాడి అనంతరం బాధితురాలిని క్లబ్‌లోని నాలుగవ అంతస్తు నుండి పార్కింగ్ ప్రదేశంలా కనిపిస్తున్న కింది ప్రాంతానికి తీసుకువచ్చిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. అయితే, ఈ గొడవ ఆ తర్వాత ఈ ఘర్షణ ఎందుకు జరిగింది? దాడికి ముందు ఏం జరిగింది అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అలాగే బాధితురాలికి సంబంధించిన పూర్తి వివరాలను మరిన్ని బయటకు రావాల్సిఉంది.

పోలీసు దర్యాప్తు, ప్రస్తుత పరిస్థితి..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు సదరు నైట్‌క్లబ్‌కు చేరుకునే సమయానికి.. అప్పటికే దాని నిర్వాహకులు మూసివేసినట్లు తేలింది. అదే సమయంలో క్లబ్‌లోని లైట్లు ఆపేసి ఉండడంతో మేనేజ్‌మెంట్ నుంచి ఎవరూ బయటకు వచ్చి మాట్లాడలేదు. అయితే ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నైట్ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES