• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Court Sridevi Boyfriend: లవ్‌లో పడిన 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి..ప్రియుడి గురించి ఎట్టకేలకు బయటపెట్టేసింది!

Court Sridevi Boyfriend: లవ్‌లో పడిన 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి..ప్రియుడి గురించి ఎట్టకేలకు బయటపెట్టేసింది!

Court Sridevi Apalla Boyfriend: 'కోర్ట్' సినిమాతో టాలీవుడ్‌‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శ్రీదేవి..సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో మరోసారి వార్తల్లో నిలిచింది. తన చేతిలో ఓ యువకుడి చేయి పెట్టి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.."జర్నీ బిగిన్స్" అని క్యాప్షన్ ఇవ్వడంతో ఆమె ప్రేమలో పడినట్లు సోషల్ మీడియా చర్చ జరుగుతోంది.

Written ByHarish Darla
Published: Oct 03, 2026, 05:07 PM IST|Updated: Oct 03, 2026, 07:10 PM IST
joinshare
Court Sridevi Boyfriend: లవ్‌లో పడిన 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి..ప్రియుడి గురించి ఎట్టకేలకు బయటపెట్టేసింది!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

2

రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

3

Court Sridevi Boyfriend: లవ్‌లో పడిన 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి..ప్రియుడి గురించి ఎట్టకేలకు బయటపెట్టేసింది!

4

Assam Night Club Incident: నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్ల దాడి..అమ్మాయిని నగ్నంగా నిలబెట్టి, పిడిగుద్దులతో...

5

Bathukamma 2026 Dates: ఈ నెల 10వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల వివరాలు ఇవే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Court Sridevi Apalla Boyfriend: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కలిగిన నటీనటులకు సరైన అవకాశాలు రావడం.. ఆ అవకాశాలతో నటనలో రాణిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో శ్రమతో కూడిన పని. అయితే కాకినాడకు చెందిన శ్రీదేవి ఆపళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తన తొలి చిత్రం 'కోర్టు'తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయింది.

మారిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌..
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తాజాగా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె చేతిలో ఓ యువకుడి చేయిని కలిపి పెట్టినట్లు కనిపించింది. ఆ ఫొటో పోస్ట్‌కు 'జర్నీ బిగిన్స్' అని క్యాప్షన్ ఇస్తూ '/SS'తో లవ్ సింబల్ జతచేయడం విశేషం. ఈ ఒక్క పోస్టుతో ఆమె ప్రేమలో పడినట్లు చెప్పకనే చెప్పిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు అది రాబోయే సినిమా తాలుకూ ప్రమోషన్ అని భావిస్తున్నారు. ఏదిఏమైనా ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫొటోకు పలు అర్థాలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

2025లో విడుదలైన 'కోర్ట్' చిత్రంలో 'జాబిల్లి' పాత్రలో నటించి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని నిర్మాణ సంస్థలో ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నటుడు, ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ కీలక పాత్రలు పోషించారు.

ఆ సినిమా తర్వాత హీరోయిన్ శ్రీదేవికి ఆఫర్లు క్యూ కట్టాయి.'బ్యాండ్ మేళం' సినిమాలో శ్రీదేవి, యంగ్ హీరో హర్ష్ రోషన్ ల కెమిస్ట్రీ బాగా ఆకట్టుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో విపరీతంగా అలరించింది. కోర్టు సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా విజయం సాధించడం విశేషం. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో, శివ ముప్పరాజు స్క్రీన్ ప్లే, విజయ్ బుల్గానిన్ సంగీతంతో రూపొందిన ఈ సినిమా మార్చి 26న విడుదలైనా.. 'కోర్ట్' సినిమా స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది.

ప్రస్తుతం యంగ్ హీరోయిన్ శ్రీదేవి 'హైకూ' అనే మరో కొత్త చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా. డీ. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మాణంలో ఏగన్, ఫెమినా జార్జ్ లతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Telugu News