• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

Ayyappa Devotees: అయ్యప్ప స్వాములు మండలం రోజులు నియమ నిష్ఠలతో పూజాలు చేసిన శబరిమల ఆలయం సన్నిధిలో ఉన్న పంబా నదిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో అయ్యప్పలు బట్టలు వ్యర్థాలను పంబా నదిలో పడేయడం వలన అది కలుషితమైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం స్వాములు ఈ పనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 10:45 IST|Updated: Nov 23, 2026, 10:55 IST
joinshare
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
Image Credit: ayyappa Devotees Do not Do these Things (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Khammam: ఎల్లలు దాటిన ప్రేమ.. బ్రిటన్ యువతిని పెళ్లాడిన ఖమ్మం అబ్బాయి.. లవ్ స్టోరీ మాములుగా లేదుగా.!.

Khammam: ఎల్లలు దాటిన ప్రేమ.. బ్రిటన్ యువతిని పెళ్లాడిన ఖమ్మం అబ్బాయి.. లవ్ స్టోరీ మాములుగా లేదుగా.!.

2

అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్..స్వాములు రైల్లో పూజ చేస్తే భారీ ఫైన్..

3

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

4

FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

5

ఆధునిక యుద్ధ సామగ్రితో పాకిస్థాన్ సమాయాత్తం.. భారత్‌ను దెబ్బ కొట్టేందుకు పాక్ భారీ వ్యూహం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ayyappa Devotees Must Follow these Rules: దీంతో అక్కడ బట్టలు ఉతకడం లేదా అక్కడ ఏదైనా నిమజ్జనం చేయడం పైన నిషేధం విధించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే 5000 రూపాయల వరకు అక్కడికక్కడే జరిమాన విధిస్తామని హెచ్చరించారు. నది కాలుష్యం ప్రజా ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉన్నందున ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు  భక్తులు తమ బట్టలు ఇతర వస్తువులను పంబ దానిఉపనదులు స్నానాల ఘాట్లలో పారేయకూడదని తెలియజేస్తున్నారు.

కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు..

శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం కేరళ ఆరోగ్య శాఖ కీలక  మార్గదర్శకాలను విడుదల చేసింది. కొండ ఎక్కే సమయంలో భక్తులు అధిక శ్రమకు గురి కావద్దని వైద్యుల సలహాలను పాటించాలని సూచించింది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యాత్ర ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకొని డాక్టర్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలె హార్ట్ ఎటాక్ వచ్చినవారు గుండె శస్త్ర చికిత్స లేదా యాంటియోప్లాస్టీ చేయించుకున్నవారు నిపుణుల  సలహా లేదా యాత్రకు రావద్దని ఆరోగ్య శాఖ తెలిపింది.

బీపి షుగర్ వంటి  వ్యాధులు అదుపులో ఉంచుకోవాలని రెగ్యులర్ గా వాడుతున్న మందులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. మందులతో పాటు డాక్టర్ ఇచ్చినప్రిస్క్రిప్షన్ కూడా దగ్గర పెట్టుకోవాలని పేర్కొంది.

వైద్య పరీక్షలు కంపల్సరీ..

మెట్లు ఎక్కే సమయంలో భక్తులు తమ శారీరక సామర్థ్యాన్ని బట్టి నడవాలని వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ తగినంత నీరు తాగాలని సూచించింది. ఖాళీ కడుపుతో కొండ ఎక్కకూడదని అయితే గుండె సమస్యల కారణంగా నీరు ఎక్కువగా తాగాలని డాక్టర్లు సూచించిన వారు ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని ఒక ప్రకటనలో తెలిపింది.

అయ్యప్ప భక్తులు పరిగెత్తకూడదు..

ఇక నడిచే సమయంలో తోపులాటల్లో వెళ్ళకుండా వెళ్ళడం లేదా పరిగెత్తడం కూడా చేయకూడదని అధికారులు భక్తులను కోరారు.ఒకవేళ నడుస్తున్నప్పుడు చాతిలో నొప్పిలేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగాఅనిపిస్తే వెంటనే ఆగిపోయి వైద్య సహాయం కోరాలని సూచించారు.

నవంబర్ 17న ప్రారంభమైన శబరిమల మండల పూజ సీజన్ డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది. అనంతరం మకర విళక్కు యాత్ర కోసం డిసెంబర్ 30న ఆలయం తిరిగి తెరచుకుంటుంది. జనవరి 14న మకర విళక్కు  పండుగ నిర్వహిస్తుండగా పండుగ జనవరి 19 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. జనవరి 20న ఆలయం మూసివేస్తారు. భక్తులు భద్రత నిబంధనలనుపాటిస్తూ యాత్రను పూర్తి చేయాలని కేరళ ఆరోగ్య శాఖ భక్తులకు  విజ్ఞప్తి చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Daily Horoscope
Telugu News