Khammam man Love marriage with british woman: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల పాటు అక్కడ ఉంటున్నారు. ఆ తర్వాత కొంత మంది తమ తోటి ఉద్యోగులతో మరికొంత మంది అక్కడి స్నేహితులతో ప్రేమలో పడుతున్నారు.ఆ తర్వాత పెద్ద వాళ్లతో మాట్లాడి తమ ప్రేమ, పెళ్లిళ్లను గెలిపించుకుంటున్నారు.ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు బ్రిటన్ కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని వార్తలలో నిలిచాడు.
ఖమ్మం జిల్లా ముస్తఫా నగర్ కు చెందిన సగ్గుర్తి భరత్, బ్రిటన్ కుచెందిన ఎలిజబెత్ ఇందుకు ఆదివారం ఘనంగా వివాహం జరిగింది. బ్రిటన్ లో వీరి పరిచయం కాస్త ప్రేమగామారి ఆ తర్వాత ఇద్దరు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఖమ్మంలోని సర్గుర్తి లక్ష్మణ, రోజా దంపతులు కుమారుడు భరత్. అతను ఎంఎస్ చదువు పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత ఉద్యోగాల వేటలో భాగంగా బ్రిటన్ కు వెళ్లాడు. అక్కడ సర్కారు కొలువుకోసం కొన్ని నెలల పాటు ప్రిపేర్ అయ్యి చివరకు పెన్షన్ శాఖలో ఉద్యోగంను సంపాదించాడు. అయితే.. అక్కడ తోటి ఉద్యోగిని ఎలిజబెత్ తో పరిచయం ఏర్పడింది.
మొదట ఇధ్దరు ఫ్రెండ్స్ గా ఉండి ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పారు. ఎలిజబెత్ తల్లిదండ్రులు ఎడ్మిన్ ఆర్మ్ స్ట్రాంగ్, హేజల్ గ్రేలీ సైతం వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇటీవల ఖమ్మం జిల్లాలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. తమ ఎల్లలు దాటిన ప్రేమను పెద్దలకు చెప్పి వారి అంగీకారంతో గెలిపించుకున్న ఈ జంటను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ లవ్ ప్రేమ వివహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.