• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

నాలుగు చక్రాల వాహనాలకు హైవేపై టోల్‌ ప్లాజా దాటితే టోల్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే, నేరుగా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమెటిగ్గా ఫాస్టాగ్‌ మన కారుకు అమర్చుకుంటే వెంటనే కట్‌ అయిపోతాయి. అయితే, మీరు బ్యాంకు ఖాతా మార్చాలన్నా.. మీ పాత కారును విక్రయించినా వెంటనే మీ పాత ఫాస్టాగ్‌ ఖాతాను క్లోజ్‌ చేయాలి. ఆ స్టెప్‌ బై స్టెప్‌ ప్రక్రియ ఏంటి తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 23, 2026, 10:27 IST|Updated: Nov 23, 2026, 10:32 IST
joinshare
FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!
Image Credit: How to close FASTag account online

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Khammam: ఎల్లలు దాటిన ప్రేమ.. బ్రిటన్ యువతిని పెళ్లాడిన ఖమ్మం అబ్బాయి.. లవ్ స్టోరీ మాములుగా లేదుగా.!.

Khammam: ఎల్లలు దాటిన ప్రేమ.. బ్రిటన్ యువతిని పెళ్లాడిన ఖమ్మం అబ్బాయి.. లవ్ స్టోరీ మాములుగా లేదుగా.!.

2

అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్..స్వాములు రైల్లో పూజ చేస్తే భారీ ఫైన్..

3

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

4

FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

5

ఆధునిక యుద్ధ సామగ్రితో పాకిస్థాన్ సమాయాత్తం.. భారత్‌ను దెబ్బ కొట్టేందుకు పాక్ భారీ వ్యూహం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to close FASTag account online: ఫాస్టాగ్‌ ఖాతా అనేది సులభతరమైన ప్రక్రియ. టోల్‌ దాటినప్పుడు చిల్లర సరిపడా లేకుంటే ఇబ్బందులు, వెనుకున్న వాహనాలు నిలిచిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టడానికే ఫాస్టాగ్‌ తీసుకువచ్చారు. అయితే, దీంతో నేరుగా మన లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతా నుంచి టోల్‌ ఛార్జీలు కట్‌ అయిపోతాయి. కేవలం 4 వీలర్స్‌ ఆపై చక్రాల వాహనాలకు మాత్రమే ఈ టోల్‌ విధిస్తారు. అయితే, మన పాత కారును విక్రయిస్తే ఫాస్టాగ్‌ ఖాతాను వెంటనే డియాక్టివేట్‌ చేయాలి. లేకపోతే మీ కారు కొనుగోలు చేసిన వారు ప్రయాణించినా ఆటోమెటిగ్గా ఫాస్టాగ్‌ నుంచి డబ్బులు కట్‌ అవుతూనే ఉంటాయి.

ఫాస్టాగ్‌ డియాక్టివేట్‌ చేసే విధానం..
మీరు కారు విక్రయించాలనుకున్నప్పుడే ఫాస్టాగ్‌ వెంటనే డియాక్టివేట్‌ చేయాలి. ఒక్కోసారి మర్చిపోయే అవకాశం కూడా ఉంది. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా ఫాస్టాగ్‌ డియాక్టివేట్‌ కాకపోతే, 1800 120 4210 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కూడా కాల్‌ చేయవచచ్చు. లేదా మీ ఫాస్టాగ్‌ యాక్టివేట్‌ చేసిన సంస్థకు కూడా కాల్‌ చేసి డియాక్టివేట్‌ చేయించండి.  మీ మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ వస్తుంది. అందులో మీ వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, ఫాస్టాగ్‌ సీరియల్‌ నెంబర్‌ కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ ఖాతా క్లోజ్‌ చేసే విధానం..
మొదట మీ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ లేదా NETC పోర్టల్‌ ఓపెన్‌ చేయించండి.
అక్కడ Account Closure లేదా Close FAST అకౌంట్‌ ఆప్షన్‌ ఎంపిక చేయండి.
అక్కడ మీ కారణాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్‌ అంటే వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (RC), ఐడీ ప్రూఫ్‌ కూడా అప్‌లోడ్‌ చేయండి.
అప్పుడు మీ ఖాతా క్లోజ్‌ అయ్యే ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. బ్యాలన్స్‌ కూడా లింక్‌ చేసిన ఖాతాకు రీఫండ్‌ అవుతుంది.

ఆఫ్‌లైన్‌లో ఫాస్టాగ్‌ క్లోజ్‌ చేసే విధానం..
మీ దగ్గరలో బ్యాంక్‌ బ్రాంచీకి వెళ్లండి.
క్లోజ్‌ ఫాస్టాగ్‌ ఫారమ్ నింపిండి. దానికి కావాల్సిన ధ్రువపత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది. మీకు ఒక రిసీట్‌ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో బ్యాలన్స్‌ మీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News