• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు స్వీకరణ మొదలు కానుంది. మొత్తం 415 ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 24, 2026, 10:42 IST|Updated: Nov 24, 2026, 10:46 IST
joinshare
బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!
Image Credit: BHEL Recruitment 2026:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

2

విజయ్ వచ్చినా మారని పరిస్థితి.. మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక మహాదీపం ఉత్కంఠ..

3

నవంబర్ చివరి వారంలో ఈ 5 రాశులకు బంపర్‌ లాభాలు.. పట్టిందల్లా బంగారమే!

4

Palnadu District: కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి.. ఎక్కడంటే..?..

5

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

BHEL Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధానంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది పెద్ద అవకాశమని చెప్పవచ్చు. మొత్తం 415 ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, ఐటీ వంటి వివిధ విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 2026 నవంబర్ 25, అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది.

బీహెచ్‌ఈఎల్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 415 ఖాళీలు ఉన్నాయి. వాటిలో రెండు వందల వరకు ఇంజనీరింగ్ లేదా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, మిగిలినవి సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులుగా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  బీహెచ్‌ఈఎల్ 2026-27 నోటిఫికేషన్ పీడీఎఫ్ విడుదలైంది. ఇంజినీరింగ్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 415 ఖాళీలలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం వంటి వివరాలు కూడా పొందుపరిచారు.

బీహెచ్‌ఈఎల్ నిర్వహిస్తున్న ఈ నియామకంలో ఇంజనీరింగ్‌తో పాటు నాన్-ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించిన ఖాళీలు కూడా ఉన్నాయి. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలను తనిఖీ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ 2026 నవంబర్ 25 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి తేదీ డిసెంబర్ 28.

మెకానికల్ విభాగానికి బీఈ లేదా బీటెక్, లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎలక్ట్రికల్ విభాగానికి బీఈ లేదా బీటెక్, లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ లేదా డ్యూయల్ డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్‌లో ఫుల్ టైమ్ బీఈ లేదా బీటెక్, లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ లేదా డ్యూయల్ డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. సివిల్ విభాగానికి ఫుల్ టైమ్ బీఈ లేదా బీటెక్, లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఫైనాన్స్ విభాగానికి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ అర్హులు. హెచ్‌ఆర్ విభాగానికి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు రెండేళ్ల పీజీ, లేదా హ్యూమన్ రిసోర్స్ పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్, ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులు.

ఐటీ లేదా సీఎస్ ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో చదివిన వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు బీహెచ్‌ఇఎల్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లేదా సూపర్‌వైజర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సూపర్‌వైజర్ 2017 అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు 400 రూపాయలు, జీఎస్టీ కలిపి మొత్తం రూ.1072 చెల్లించాలి.

బీహెచ్‌ఈఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అక్కడ "రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఇంజినీర్ లేదా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు" అనే అడ్వర్టైజ్‌మెంట్‌పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి అర్హతలు సరిచూసుకోవాలి. అర్హులైతే రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫోటోగ్రాఫ్, సంతకం అప్‌లోడ్ చేయాలి. చివరగా ఫీజు చెల్లించి, ఒకసారి సమీక్షించి, దరఖాస్తు ప్రింట్ తీసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Jobs
Telugu News