• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్‌ను గత కొన్నేళ్లుగా మూడు తుపానులుగా ముంచెత్తాయి. ముందుగా ఆర్నబ్ తుపాను ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత మురసు తుపాను కూడా దక్షిణ కోస్తాను తీవ్రమైన కోతకు గురి చేసింది. ఇక ఆక్వాన్ తుపాను మాత్రం తృటిలో తప్పిపోయింది. తాజాగా వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 10:12 IST|Updated: Nov 24, 2026, 10:15 IST
joinshare
APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..
Image Credit: AP Rain News (Source/ZEE News Telugu)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

2

గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

3

ఈ 3 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు? సూర్య, చంద్రుల షడాష్టక యోగం ప్రభావం ఇదే!

4

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

5

పడమర, ఉత్తర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Weather Update: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా  వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (Weather Department) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో  ముఖ్యంగా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


ద్రోణి ప్రభావంతో  దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలన్న వాతావరణశాఖ.. 

ఈ రోజు  మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ పట్నం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది  వాతావరణ శాఖ. ఇక ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలోని చాలా జిల్లాల్లో కరువు తాండవిస్తుంది. అంతేకాదు భూగర్భ జలాలు అడుగంటాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. దీంతో రైతాంగం దిగాలుగా ఉంది. మరోవైపు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి నీళ్లు వస్తున్న అవి చాలడం లేదు.

ద్రోణి ప్రభావంతో  దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలన్న వాతావరణశాఖ ..

అయితే  ఈ సారి తుపాను కారణంగా కోస్తాంధ్రలో నీటి ఎద్దడి తప్పింది. కానీ తెలంగాణలో మాత్రం ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ట్యాంకర్స్‌తో నీళ్లు తెప్పిద్దామన్నా సరిపడా లేవు. ఈ నేపథ్యంలో రాయలసీమలో ఈ రోజు, రేపు వర్షాలతో అక్కడ భూగర్భ జల మట్టాలు పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు వర్షాలు పడే సమయంలో ప్రజలు, రైతులు పొలాల్లో పనిచేయకూడదని చెప్పుకొచ్చారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్లు, హోర్డింగుల కింద, కరెంట్ స్తంభాల దగ్గర ఉండవద్దని హెచ్చరికలు జారీ చేసింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
AP Weather
Weather Update