SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బిహార్‌లో వింత ఘటన.. మొదటి భర్త ముందే ప్రియుడిని పెళ్లాడిన మహిళ..

Bihar Woman Marries Lover: ఓ మహిళ తనకు వరసకు అల్లుడైనా వ్యక్తితో పెళ్లి చేసుకున్న ఘటన బిహార్‌లో జరింది. కన్న బిడ్డను వదిలి పెట్టి.. వెరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంలో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 15, 2026, 11:32 AM IST | Updated: Oct 15, 2026, 11:34 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Bihar Woman Marries Lover: వైవాహిక జీవితంలో మనస్పర్థలు వస్తే గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. అయితే, బిహార్‌లోని జముయి ప్రాంతంలో వీటన్నింటికీ భిన్నంగా ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఇప్పుడు ఈ ఘటనే అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఓ మహిళకు తన మొదటి భర్త.. కుటుంబ సభ్యుల సమక్షంలోనే వరుసకు మేనల్లుడయ్యే వ్యక్తిని ప్రేమించి.. స్థానిక ఆలయంలో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆయుషి కుమారి అనే మహిళకు 2021లో విశాల్ దూబేతో పెళ్లి జరిగింది.. వీరికి ఓ కుమార్తె కూడా పుట్టింది.. అయితే.. రోజుల గడుస్తున్న కొద్ది భర్త కుటుంబానికి బంధువైన అల్లుడుతో ఆయుషికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా క్రమంగా ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జూన్ 15న ఆయుషి తన ప్రియుడు సచిన్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందట... భార్య కనిపించకపోవడంతో ఆందోళన పడ్డ.. విశాల్ దూబే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడట..

పోలీసుల విచారణతో పాటు కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం.. ఆయుషి తన భర్త విశాల్‌కు విడాకులు ఇచ్చేందుకు దరఖాస్తు కూడా చేసుకుందట.. ఇకపై తాను సచిన్‌తోనే జీవితాన్ని గడపాలనుకుంటుందని తను మంచి నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 20న సిఖేరియా గ్రామ సమీపంలోని ఓ ఆలయంలో ఆయుషి, సచిన్‌లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. విచిత్రమేమిటంటే.. ఈ పెళ్లి వేడుకకు ఆమె మొదటి భర్త విశాల్ స్వయంగా హాజరవడం ఆశ్చర్యం కలిగిస్తోంది..

పెళ్లి అనంతరం ఆయుషి మాట్లాడుతూ.. ఇకపై సచిన్ మాత్రమే తన సర్వస్వమని.. తమ రెండేళ్ల ప్రేమ వివాహంతో నిలబడిందని సంతోషం వ్యక్తం చేసింది.. సచిన్ కూడా ఆమెతో కలిసి జీవితాంతం తోడుంటానని వెల్లడించారు. మరోవైపు మొదటి భర్త విశాల్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. ఆమె నిర్ణయానికి తాను ఎలాంటి అడ్డుచెప్పడం లేదని చెబుతూ వచ్చారు. అయితే, తనపై ఆయుషి చేసిన మానసిక, శారీరక వేధింపుల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు.. చిన్నారి పాపను వదిలిపెట్టి.. కుటుంబ సంబంధాలను పక్కనపెట్టి, ఆ యువతి తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎప్పుడో జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES