రూ. 1 కే అపరిమిత కాలింగ్, 1GB డేటా! BSNL బంపర్ దీపావళి ధమాకా ఆఫర్.. వివరాలివే!
BSNL Freedom 2.0 Offer: ప్రభుత్వ దిగ్గజ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళి సందర్భంగా అతి తక్కువ ధరలోనే మీరు కనెక్షన్ పొందవచ్చు. అదే బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0. ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్లాన్.. కేవలం రూ.1 తో సిమ్ కార్డు కొనుగోలు చేస్తే మీరు పొందే లాభాలు ఏంటి తెలుసుకుందాం.
BSNL Freedom 2.0 Offer: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ ఎన్నో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న రీఛార్జీ ప్లాన్స్ యూజర్‌లకు అందిస్తోంది. అయితే, రూ.1 తో దీపావళి ధమాకా తీసుకువచ్చింది. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ప్రతిరోజ 1 జీబీ డైలీ డేటా కూడా పొందుతారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 ప్లాన్ పేరిట దీపావళి భారీ ఆఫర్ తీసుకువచ్చింది. అయితే, ఈ రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.1 కు సిమ్ కార్డు కొత్తగా కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు పొందే బెనిఫిట్స్ ఏంటి? తెలుసుకుందాం.
ఈ ఆఫర్ ప్రస్తుతం నవంబర్ 9వ తేదీ వరకు పొడగించారు. ఇందులో ప్రతిరోజూ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, మెసేజ్ సేవలు కూడా పొందుతార. దీన్ని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ వేధికగా షేర్ చేసింది. 'అద్భుతమైన రూ.1 కనెక్షన్‌తో పాకెట్ ఫ్రెండ్లీ అనుభవం పొందండ, మీ కనెక్టివిటీని బీఎస్‌ఎన్‌ఎల్ 2.0తో పెంచుకోండి' అని ఎక్స్ వేధికగా షేర్ చేసింది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్..
ఈ సరికొత్త బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్.. తక్కువ ధరలోనే పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే.. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ ధర కేవలం రూ.1 మాత్రమే.. దీని వ్యాలిడిటీ 24 రోజులు వర్తిస్తుంది.. ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాతోపాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఈ దీపావళి ధమాకా ఆఫర్ 2026 నవంబర్ 9వ తేదీ వరకు ఉంది.
Read Also: జియో, ఎయిర్‌టెల్‌లకు షాక్! కేవలం రూ. 202తో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. ఏం ఆఫర్లు ఉన్నాయంటే?
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1 కొత్త కనెక్షన్ పొందే విధానం..
ఈ దీపావళి ధమాకా ఆఫర్‌లో భాగంగా మీరు బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు కొత్తది కొనుగోలు చేయల్సి ఉంటే సింపుల్‌గా మీ దగ్గరలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ వెళ్లి ఈ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ గురించి ఎంక్వైరీ చేయవచ్చు. మీ తోపాటు మీ ఆధార్ కార్డు తప్పనిసరి. మీ ఆధార్ వెరిఫై అయిన వెంటనే మీరు ఫార్మలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ చేసే ముందు ధర, వ్యాలిడిటీ, బెనిఫిట్స్ చెక్ చేసుకోండి. అయితే, ఈ ఆఫర్ ఒక వ్యక్తి కేవలం ఒక్కసారి మాత్రమే పొందుతాడు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే రీఛార్జీ ధరలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అప్పుడప్పుడు పండుగ ఆఫర్లను కూడా ప్రకటిస్తుంది ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ..