BSNL: కేవలం రూ.51కే 2GB రోజువారీ డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్.. ఫ్రీ సిమ్ కూడా!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బడ్జెట్ ధరలో ఆఫర్లను అందిస్తోంది. ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ 501 రూపాయలతో ఉచిత సిమ్‌తో పాటు రెండు జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలను అందిస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL Rs 51 Recharge Plan 2026: ఈ కాలంలో టెలికాం కంపెనీలు యూజర్ల నడ్డి విరుస్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలంటే రోజురోజుకు ధరలు మరింత భారంగా మారుతున్నాయి. ఈ సమయంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో కొత్త సిమ్ కార్డుతో పాటు బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాలింగ్ కేవలం రూ.51 కే అందుబాటులో ఉంది. ఈ బీఎస్ఎన్ఎల్ ఆఫర్‌ను కొన్ని రోజులు మాత్రమే ప్రత్యేకంగా పరిచయం చేశారు. 2026 నవంబర్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ ప్లాన్ ఎంచుకోవాలనుకుంటే, వివరాలు ఇవే.
కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలు చేయాలనుకునే వారికి, సిమ్ కనెక్షన్‌తో కేవలం రూ.51 కే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతి రోజు 2 జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 56 జీబీ డేటా పొందుతారు.
ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యాలిడిటీ సమయంలో లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా లభిస్తాయి. అంతేకాదు, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా అందిస్తారు. ఇంటర్నెట్‌తో పాటు కాలింగ్ సౌకర్యం కావాలంటే ఈ ప్లాన్ ఎంచుకోవాల్సిందే. ఒకే ప్లాన్‌తో ఇవన్నీ పొందవచ్చు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ కేవలం కొత్తగా సిమ్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఇది వర్తించదు. మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులైతే, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారినా ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. ఆలస్యం చేయకుండా త్వరగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ రూ. 51 ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2026 నవంబర్ 30వ తేదీ వరకే గడువు ఉంది.. ఆ తర్వాత ఈ ఆఫర్ ఉండకపోవచ్చు. ఈ ఆఫర్ పొందాలంటే కస్టమర్లు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలి. లేదా ఎయిర్‌టెల్, జియో వినియోగదారులైతే ఈ సమయంలోనే బీఎస్ఎన్ఎల్‌కు మారితే ప్రయోజనం పొందగలరు. ప్రమోషన్లలో భాగంగా బీఎస్ఎన్ఎల్ వివిధ సర్కిళ్లలో ఈ ప్లాన్ వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటోంది. కేవలం రూ.51 తో కొత్త సిమ్ కొనుగోలు చేయడమే కాకుండా, ప్రతి రోజు 2 జీబీ డేటా కూడా పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఇందులో లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్‌కు మారాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.