• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కేంద్రం వేటు? ఏకపక్ష వైఖరి, సొంత ఎంపీల ఫిర్యాదుతో దిగొచ్చిన మోదీ ప్రభుత్వం?

CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కేంద్రం వేటు? ఏకపక్ష వైఖరి, సొంత ఎంపీల ఫిర్యాదుతో దిగొచ్చిన మోదీ ప్రభుత్వం?

CEC Gyanesh Kumar Suspension: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖలు రాయడంతో ఆయనపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెలువడిన తర్వాత సీఈసీని పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ వివాదంపై ఎన్నికల కమిషనర్లు రాసిన ఫిర్యాదు లేఖలను కేబినెట్ కార్యదర్శి కేంద్ర న్యాయశాఖకు పంపినట్లు సమాచారం.

Written ByHarish Darla
Published: Sep 26, 2026, 12:50 PM IST|Updated: Sep 26, 2026, 12:59 PM IST
joinshare
CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కేంద్రం వేటు? ఏకపక్ష వైఖరి, సొంత ఎంపీల ఫిర్యాదుతో దిగొచ్చిన మోదీ ప్రభుత్వం?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CEC Gyanesh Kumar Suspension: కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శైలి, కమిషన్ పేరిట ఆయన తీసుకుంటున్న ఏకపక్ష, చట్టవిరుద్ధ నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వారు గతంలోనే కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది.

తొలుత కేంద్రం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంతో పరిస్థితులు వేగంగా మారాయి. దీంతో కేబినెట్ కార్యదర్శి ఆ లేఖలను కేంద్ర న్యాయశాఖకు పంపారని సమాచారం అందుతోంది. 

భారత ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య న్యాయశాఖ అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నందున ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. విపక్షాల నిరసనలు, సొంత పక్షాల ఒత్తిళ్ల నేపథ్యంలో సీఈసీపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోందన్న చర్చ జరుగుతోంది.

దేశవ్యాప్త నిరసనలు..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రచురితమైన తర్వాత సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని, ఆయనను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ అంశంపై దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమై సీఈసీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యాయి.

కేవలం విపక్షాలే కాకుండా, కేంద్రంలోని అధికార పక్షంలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా సీఈసీ, ఎన్నికల సంఘం నుంచి పూర్తి జవాబుదారీతనాన్ని కోరుతున్నాయి. గతంలో నీట్ (NEET) అక్రమాల విషయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయాన్ని నాన్చడం వల్ల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన తీవ్రమై దేశవ్యాప్త మద్దతు లభించింది. ప్రస్తుతం సీఈసీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అలాంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటోంది.

చట్ట సవరణలు, రాజకీయ నేతల డిమాండ్లు 
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడం, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో కీలక మార్పులు చేయడం ద్వారానే ఈ రాజకీయ సెగ చల్లారే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా మొదట సీఈసీపై వేటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై కర్ణాటక హోంశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే రెండు రోజుల క్రితమే ట్వీట్ ద్వారా స్పందించారు. 

సీఈసీని బలిపీఠం ఎక్కించేందుకు రంగం సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆయనను తప్పించడమే కాకుండా, ఆయన వెనుక ఉండి నడిపించిన వారిని కూడా బయటపెట్టాలని ప్రియాంక్ ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
PM Modi