SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఛఠ్ పూజ ప్రసాదం తిందని చిన్నారి ప్రాణం తీసిన కన్న తల్లి..!!

Chhath Puja: పవిత్ర పండగ వేళ బీహార్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఛఠ్ పూజ కోసం తయారు చేసిన ప్రసాదాన్ని చిన్నారి తినడంతో ఆగ్రహానికి గురైన కన్న తల్లి తన నాలుగేళ్ల కూతురిని దారుణంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.

Written By Bhoomi
Published: Nov 16, 2026, 14:44 IST | Updated: Nov 16, 2026, 14:45 IST
Image Credit: Chhath Puja:
Join

Chhath Puja: పవిత్ర పండగ వేళ బీహార్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఛఠ్ పూజ కోసం తయారు చేసిన ప్రసాదాన్ని చిన్నారి తినడంతో ఆగ్రహానికి గురైన కన్న తల్లి తన నాలుగేళ్ల కూతురిని దారుణంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. 
బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా పైసాతానా పరిధిలోని మొహమ్మద్ పూర్ బిరౌలీ గ్రామానికి చెందిన రాజు భార్య రీనా కుమారి ఛఠ్ పూజ కోసం ప్రత్యేక పిండివంటలు, ప్రసాదం తయారు చేస్తోంది. ఆ సమయంలో తన నాలుగున్నరేళ్ల కూతురు సుహాని కుమారి ఆ ప్రసాదం తినేందుకు ప్రయత్నించింది. పూజకు సిద్ధం చేసిన ప్రసాదాన్ని చిన్నారి ముట్టుకుని అపవిత్రం చేసిందన్న కోపంతో తల్లి రీనా కుమారి ఒక్కసారిగా ఆవేశానికి లోనైంది. చిన్నారి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్న పాపను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి, సుహానీ ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగే సమయంలో మిగతా కుటుంబ సభ్యులు ఛఠ్ పూజ కోసం ఘాట్ వద్దకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి చిన్నారి పడి ఉండటం చూసి ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమ్మిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితురాలు కన్న తల్లి రీనా కుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పండగవేళ జరిగిన ఈ అమానుష ఘటనతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది.  

Also Read: 

 

 

కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది...అని చెబుతున్న మంత్రి - చెప్పుల మూట నీతి కథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES