SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Abhijeet Dipke: కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట పెను విషాదం.. ఏంజరిగిందంటే..?..

Abhijeet dipke grand mother dies: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు పీక్స్ కు చేరింది. కాక్రోచ్ నిరసన కారులు పలుచోట్ల బారికెడ్లను తోసుకుంటూ జంతర్ మంతర్ వైపుకు దూసుకెళ్లారు. మరోవైపు అభిజిత్ దీప్కే ఇంట పెనువిషాదం చోటు చేసుకుంది.

Written By Inamdar Paresh
Published: Oct 10, 2026, 04:02 PM IST | Updated: Oct 10, 2026, 04:07 PM IST
Image Credit: Abhijeet Dipke (file)
Join

Abhijeet dipke grand mother dies in Maharashtra: దేశ రాజధాని ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో అట్టుడుకుతుంది. ఇప్పటికే పోలీసులు వేలాదిగా జంతర్ మంతర్ చుట్టు భద్రత చేపట్టారు. పోలీసులు ఇంటర్నేట్ సేవలు నిలిపివేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లు, ఇనుప చువ్వలను ఏర్పాటు చేశారు.  జంతర్ మంతర్ వద్ద ఆరంచెల్లో బారికెడ్లను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో పలు  చోట్ల కాక్రోచ్ నిరసన కారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. బారికెడ్లను తోసుకుంటూ దూసుకునిపోయారు. దీంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు  కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట పెనువిషాదం చోటుచేసుకుంది.

అభిజిత్ దీప్కే నానమ్మ సావిత్రి బాయి మహారాష్ట్రలోని హింగోలిలో కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి వయసు రీత్యా,  తీవ్ర అనారోగ్య సమస్యలతో సావిత్రిబాయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సావిత్రిబాయి ఈ రోజు మరణించారు.


ఇదిలా ఉండగా, అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు అనితా, భగవాన్ దీప్కే ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్నారు. అయితే వారి నివాసం బయట పోలీసు సిబ్బందిని మోహరించారు. మృతి వార్త తెలియగానే, వారు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు  హింగోలికి బయలుదేరారు. మరోవైపు

ఈ క్లిష్ట సమయంలో అభిజిత్ దీప్కేను హింగోలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారా..?.. లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై కాక్రోచ్ ల నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES