SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దుర్గమ్మ విగ్రహంపై ప్రత్యక్షమైన నాగుపాము.. వైరల్‌ వీడియో!

Cobra On Durga Idol Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. ఒక దుర్గాదేవి విగ్రహం పై నాగుపాము ప్రత్యక్షమవడంతో అక్కడున్న భక్తులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ ఆ పామును నియంత్రించి పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 20, 2026, 12:56 PM IST | Updated: Oct 20, 2026, 12:58 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Cobra On Durga Idol Video: దేవీ శరన్నవరాత్రులు ముగింపు సమయంలో విజయదశమి పర్వదినాన సోషల్ మీడియాలో ఒక వీడియో ఊహించని స్థాయిలో చెక్కర్లు కొడుతూ వస్తోంది. ఓ వింత దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులతో పాటు భక్తులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో సుందరంగా అలంకరించిన దుర్గాదేవి విగ్రహంపై ఏకంగా ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను సైతం షేక్ చేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియో వివరాల్లోకి వెళ్తే.. పూజా మండపంలో కొలువుదీరిన అమ్మవారి విగ్రహం పై భాగంలో ఒక భారీ నాగుపాము మెల్లగా పాకుతూ భక్తులకు కనిపించింది. పూలమాలల మధ్య కదులుతూ ఉన్న ఆ సర్పం అమ్మవారికి ఒక ఆభరణంలో ఒదిగిపోయిన దృశ్యాలు మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అయితే అక్కడ ఉన్న భక్తులు నాకు పాము కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆలయాల్లో లేదా విగ్రహాల సమీపంలో సర్పాలు కనిపించడం అరుదుగా జరుగుతుంది. దసరా పర్వదినం రోజునే ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఇదంతా అమ్మవారి మహిమే అంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..

మండపంలో పాము గమనించిన స్థానికులు.. అలాగే అక్కడే ఉన్న నిర్వాహకులు ఎలాంటి దుర్ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. అయితే వారు వెంటనే అక్కడికి చేరుకొని.. అమ్మవారి పై ప్రత్యక్షమైన ఆ నాగుపామును వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎంతో చాకచక్యంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..

అమ్మవారి విగ్రహానికి లేదా ఆ సర్పానికి ఎలాంటి హాని కరగకుండా.. ప్రత్యేకంగా రెస్క్యూ టీం తమ వద్ద ఉన్న స్నేక్ స్టిక్స్ తో రంగంలోకి దిగారు. చాలా నెమ్మదిగా ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ పాము కూడా కదలకుండా కొద్దిసేపు ఉండడంతో వారు వెంటనే దానిని పట్టుకొని ఒక డబ్బాలో బంధించారు. అంతేకాకుండా ఎవరికి ప్రమాదం లేని అడవి ప్రాంతంలో విడిచి పెట్టేందుకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో భక్తులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు..

ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారింది. ఘటన సరిగ్గా ఏ ప్రాంతంలో జరిగిందని విషయంపై స్పష్టత లేనప్పటికీ.. ఈ వీడియోకు మాత్రం లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. సాక్షాత్తు అమ్మవారు నాగరూపంలో దర్శనం ఇచ్చిందని.. విజయదశమి వేల ఇదొక శుభచకుణమని.. ఆదిపరాశక్తి లీల అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది జై భవాని అంటూ కూడా కామెంట్లు పెట్టడం మీరు చూడొచ్చు. ఏది ఏమైనా దసరా రోజున ఇలా వీడియో వైరల్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేసింది..

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES