• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Viral Video: కోతులు అంటేనే మనకు వాటి అల్లరితనం గుర్తుకొస్తూ ఉంటుంది.. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు కోతులు వీటికి భిన్నంగా ఉన్నాయి. యజమానుల వంటింట్లో ఉన్న గిన్నెలను శుభ్రం చేస్తూ కనిపిస్తున్న కోతులను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 20, 2026, 02:00 PM IST|Updated: Oct 20, 2026, 02:01 PM IST
joinshare
ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Vijayasai Reddy: జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా.. దసరా వేళ కొత్తపార్టీపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన..

Vijayasai Reddy: జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా.. దసరా వేళ కొత్తపార్టీపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన..

2

Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

3

Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.

4

ఇంట్లో గిన్నెలు కడుగుతున్న రెండు కోతులు.. వాటి పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

5

30 అడుగుల అనకొండతో చిన్నారి ఆటలు.. వైరల్ వీడియో

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Viral Video: సాధారణంగా కోతులు అంటేనే అల్లరి పనులు చేస్తూ ఉండడం మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఎదురుగా కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లడం వంటివి మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా కాస్త స్థలం దొరికితే చాలు.. అక్కడ విధ్వంసం సృష్టించడమే వాటి నైజాం.. అయితే అందుకు పూర్తి భిన్నంగా రెండు కోతులు అత్యంత బాధ్యతగా ఇంటి పనులు చేస్తున్న అరుదైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వంట గదిలో కూర్చుని గిన్నెలను ఎంతో శుభ్రంగా కడుగుతున్న రెండు కోతులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కోతులు నిజంగా వంట గిన్నెలను కడుగుతున్నాయా? వీటికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పెంపుడు కోతులు కిచెన్ ఫ్లోర్ పై కూర్చుని ఉండడం మీరు క్లియర్గా గమనించవచ్చు. వాటి ముందు ఎంగిలి గిన్నెలతో పాటు ఒక చిన్న నల్ల నుంచి నీళ్లు రావడం మీరు గమనించవచ్చు. అసలు ఏ విధంగానైతే తోముడు పీల్చుతో పాత్రలను వృద్ధి శుభ్రం ఇస్తారో.. సరిగ్గా అలాగే ఈ మూగ జీవులు కూడా గిన్నెలను చేతుల్లోకి తీసుకొని అత్యంత శ్రద్ధతో తోమడం మీరు చూడొచ్చు. జిడ్డు వదిలేందుకు ప్రయత్నిస్తున్న తీరు.. నీటితో వాటిని కడిగే విధానం చూసిన వారిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. పెంపుడు జంతువులుగా పెరిగిన ఈ కోతులు తమ యజమానులు చేసే పనులు గమనించి.. అదే విధంగా అనుసరిస్తూ నేర్చుకున్నట్లు స్పష్టమౌతోంది..

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కొద్దిసేపట్లోనే వైరల్ అవ్వడం ప్రారంభమైంది. అంతే కాకుండా ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని రోజులకే లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంది. వేలాది లైకులతో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వింతను చూసి ఆనందంతో కామెంట్ల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో పని మనుషులు దొరకడం పెద్ద గగనం అయిపోయిందని.. ఇలాంటి తెలివైన కోతులు ఇంట్లో ఉంటే రోజు ఇంటి పనులు చిటికెలో పూర్తవుతాయని కొందరు సరదాగా కామెంట్లలో స్పందిస్తూ వస్తున్నారు. మరికొంతమంది వీటికి క్రమశిక్షణ చూస్తుంటే ఎంతో ముచ్చటిస్తూ ఉంది.. అంటూ కోతులపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు..

సాధారణంగా అన్ని జంతువుల కంటే కోతులకు మనుషులను అనుసరించే శక్తి ఎక్కువగా ఉంటుందట. మనుషుల ప్రవర్తనను ఇట్టే పసిగట్టడంలో కోతులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయట.. అందుకే మనుషులు చేసే పనులు కోతులు చాలా సులభంగా చేయగలుగుతాయని కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఈ వీడియో ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. రోజువారి ఒత్తిడితో కూడిన జీవితాల్లో ఇలాంటి సరదా దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులకు ఉప సమయాన్ని అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు.
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Gaitlyn Rae (@lifewithgaitlyn)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News