SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మో.. యువకుడి ప్యాంటులోకి నాగుపాము.. ఏం చేశారో చూడండి!

Cobra Snake Rescue Video: ఓ వ్యక్తి ప్యాంటులో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము దూరింది. అయితే, అక్కడే ఉన్న స్నేక్ క్యాచర్ వెంటనే అతని ప్యాంటు విప్పి ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు.. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 03:46 PM IST | Updated: Oct 25, 2026, 03:47 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Cobra Snake Rescue Video: సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వింతలు విశేషాలు ఆశ్చర్యం కలిగించే ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా విషెస్సర్పాల దాడి లేదా వాటిని రెస్క్యూ చేసే సమయంలో క్లిప్స్ సోషల్ మీడియా వినియోగదారులను క్షణాల్లో ఆకర్షిస్తూ ఉంటాయి. ఆజాగా అలాంటి అత్యంత భయంకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. లగేజ్ పట్టుకొని ఉన్న ఓ వ్యక్తి ప్యాంటు లోకి ఏకంగా అత్యంత విషపూరితమైన నాగుపాము దూరిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అయితే, దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రయాణికుడి చేతుల్లో లగేజ్ పట్టుకొని నిలబడి ఉండగా.. అతని కాళ్ల దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించింది.. తీరా చూస్తే అతని ప్యాంటు లోకి ఒక ప్రమాదకరమైన పాము దూరడం గుర్తించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిన్న పాటి కదలిక జరిగిన.. లేదా కంగారుపడి పరుగులు తీసిన ఆ పాము తక్షణమే కాటు వేసే ప్రమాదం ఉంది. దీంతో ఆ వ్యక్తి ఏమాత్రం కదలకుండా అక్కడే ఉండిపోయాడు..

విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. ఏమాత్రం తొందరపాటు పడకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం మీరు గమనించవచ్చు.. బాధితుడిని నిశ్శబ్దంగా.. కదలకుండా ఉండాలని సూచించడంతో.. అతడు అలాగే ఉండిపోవడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి ప్యాంటు నెమ్మదిగా.. అత్యంత జాగ్రత్తగా కాళ్ళ కింద వరకు విప్పడం మొదలుపెట్టాడు. ప్యాంటు కిందికి జారగానే లోపల చుట్టుకొని ఉన్న నాగుపాము పడగవిప్పి కనిపించడం మీరు చూడొచ్చు. అది దృశ్యాలు చూసిన చుట్టుపక్కల ఉన్నవారు వారి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్స్ తీసి వీడియో రికార్డు చేయడం ప్రారంభించారు.. అయితే స్నేక్ క్యాచర్ తన దగ్గర ఉన్న పరికరాల సహాయంతో ఎటువంటి హాని కలగకుండా.. ముఖ్యంగా బాధితులపై దాడి చేయకుండా నెమ్మదిగా దానిని రెస్క్యూ చేయడం మీరు చూడొచ్చు..

క్షణాల వ్యవధిలో మృత్యు అంచుల దాకా పెళ్లి సురక్షితంగా బయటపడిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే ఆ స్నేక్ క్యాచర్ చాలా నెమ్మదిగా ఆ పాముని బయటికి తీసినట్లు సమాచారం. ఈ వీడియో చివరిదాకా లేకపోయినప్పటికీ.. అతను మాత్రం ఆ పామును సురక్షితంగా రక్షించాడట.. సరైన సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన స్నేక్ క్యాచర్ ను అందరూ సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఆయనపై వివిధ రకాలుగా కామెంట్లు రాసుకు వస్తున్నారు..

అదే సమయంలో.. ప్రయాణాలు చేసేటప్పుడు.. బస్సు లేదా రైల్వే స్టేషన్ ల వద్ద లగేజ్ బ్యాగులను నేలపై లేదా చెట్టు కింద ఉంచే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తూ వస్తున్నారు. చల్లదనం లేదా ఆహారం కోసం పాములు బ్యాగులతో పాటు లగేజ్ లో దూరి.. ఆ తర్వాత మనుషుల బట్టల్లోకి దూరే అవకాశాలు ఉన్నాయని వారు తెలుపుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES