సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!
భారత పర్యాటకానికి మరో విశిష్ట అనుభవం లభించనుంది.. అదే కార్డేలియా స్కై రెండో నౌక ముంబైకి చేరుకుంది. ఇందులో మొత్తం 2400 మంది పైగా విలాసవంతంగా ప్రయాణించవచ్చు. లగ్జరీ గదులతో పాటు బార్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇతర గేమ్స్ జోన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి సముద్రంలో తేలియాడే ఒక అద్భుతమైన ప్రపంచం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ట్రావెలింగ్ అంటే ఇష్టం లేని వారు చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడూ రైలు, బస్సు లేదా విమాన ప్రయాణం మాత్రమే కాకుండా, సముద్ర తీరాన సేదతీరుతూ ప్రయాణించాలని చాలామంది అనుకుంటారు. అయితే, ముంబై వేదికగా కార్డేలియా స్కై ఇదివరకు కొద్దిమంది మాత్రమే అనుభవించారు. భారత క్రూయిజ్ పరిశ్రమలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. రెండో క్రూయిజ్ నౌక ముంబైకి చేరుకుంది. క్రూజ్ ప్రయాణం చేయాలని చాలామంది కోరుకుంటారు. ఇదివరకు కేవలం క్రూయిజ్ జర్నీ అంటే బ్యాంకాక్ ఇతర బయట దేశాల్లో మాత్రమే లభించే ఈ అనుభవం. ఇప్పుడు ముంబైకి కూడా అందుబాటులోకి వచ్చింది. సముద్ర మార్గంలో క్రూయిజ్‌లో ప్రయాణించాలని కోరుకునే వారి కోసం ఈ అద్భుతమైన క్రూయిజ్. ఇది కార్డేలియాకు చెందిన రెండో నౌక రాకతో ప్రయాణ సామర్థ్యం మరింత పెరగనుంది. దీనివల్ల మరింత మంది ప్రయాణించవచ్చు. మన దేశంలోని క్రూయిజ్ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఐదేళ్ల తర్వాత కార్డేలియా స్కై రాక సాధ్యమైంది. అంతకుముందు కడేలియా ఎంప్రెస్స్ నౌక వచ్చింది. ఇది రెండో నౌక.
కార్డేలియా స్కై ప్రత్యేకతలు ఇవే..
కార్డేలియాకు చెందిన ఈ రెండో నౌక రాకతో మరింత మంది దీని అనుభవాన్ని పొందవచ్చు. ఈ క్రూయిజ్ సామర్థ్యం ప్రకారం మొత్తం 2400 మంది ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. ఇందులో మొత్తం 77,104 డెక్లు, 11 బార్లు, 10 ఫుడ్, డ్రింకింగ్ వేదికలు ఉన్నాయి. అత్యాధునిక లాంజ్‌లలో కేవలం భారతీయ వంటకాల మాత్రమే కాదు.. ఇటాలియన్, జపనీస్ వంటి రుచికరమైన వంటకాలను ప్రయాణికులకు బఫె రెస్టారెంట్లు, కెఫేల అనుభవాన్ని కూడా ఇస్తాయి. సముద్ర వీక్షణతో కూడిన భోజన సేవలను కూడా ఈ కార్డేలియా క్రూయిజ్ అందిస్తుంది. క్రూయిజ్ ప్రయాణం మరువలేని జ్ఞాపకం. ఇదివరకు క్రూయిజ్‌లో ప్రయాణించిన వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, వీడియోలు మీరు చూసే ఉంటారు. మీరు కూడా అలాంటి అనుభవాన్ని పొందాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం.
ఈ కార్డేలియా స్కైలో మొత్తం రెండు స్విమ్మింగ్ పూల్స్, 5 హాట్ టబ్స్, 30,000 చదరపు అడుగుల డెక్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం 930 సీట్ల మ్యూజికల్ థియేటర్, స్పోర్ట్స్ కోట్స్, పికిల్‌బాల్ ,ఫిట్‌నెస్ సెంటర్, పిల్లలకు ప్రత్యేకమైన గేమ్ జోన్స్ కూడా ఉన్నాయి. సముద్ర వీక్షణతో కూడిన లగ్జరీ సూట్స్, మినీ సూట్స్ , ఇంటీరియర్ క్యాబిన్‌లతో మంచి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.
లాభాల బాటలోకి కార్డేలియా..
గతంలో నష్టాలు అనుభవించిన కార్డేలియా.. ఈ క్రూయిజ్‌ల రాకతో లాభాల బాటలోకి వెళ్ళింది. మాతృ సంస్థ వాటర్ వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్, గత త్రైమాసికంలో రూ.8.9 కోట్ల నికర నష్టాన్ని చూసింది. కానీ ఇప్పుడు రూ.58.5 కోట్ల లాభాన్ని ఆర్జిస్తోంది. అంటే గత ఆదాయం రూ.101.5 కోట్ల నుండి రూ.132.9 కోట్లకు పెరిగింది. మొత్తం 31 శాతం పెరుగుదల.