ఛీఛీ.. ఢిల్లీ మెట్రోలో ప్రేమ జంట ఏం చేసిందో చూడండి.. వీడియో ఇదే!
Delhi Metro Couple Video: ఢిల్లీ మెట్రో ఓ ప్రేమ జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆ జంట ప్రైవేటు పనులు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Delhi Metro Couple Video: ప్రతి రోజు లక్షలాది మంది ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే, ప్రయాణించే సమయంలో కొంతమంది యువతి, యువకులు చేసే అనుచిత ప్రవర్థనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేసే సమయంలో లవర్స్ రొమాన్స్ చేసుకోవడం, ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడానికి సంబంధించిన ఘటనలు ఎన్నో వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.. ఇంతకీ ఏం జరిగింది. ఇలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెట్రోను రోజు అన్ని వర్గాల ప్రజలు వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులుతో పాటు వృద్ధులు, కుటుంబ సమేతంగా ప్రయాణించే వారు తమ ప్రయాణం ప్రశాంతంగా సాగాలని కోరుకుంటారు.. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా గౌరవప్రదంగా ప్రవర్తించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత.. అయితే, రీల్స్ పేరుతో లేదా వింత వికృత చేష్టలతో కొందరు తోటివారికి తీవ్ర ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తూ వస్తున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది..
వీడియో వివరాల్లోకి వెళితే.. మెట్రో రైలు కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక జంట.. తమ మధ్య ఒక బ్లూ కలర్ బ్యాక్‌ప్యాక్‌ను అడ్డుగా పెట్టుకుని.. బహిరంగంగా అనుచితమైన రీతిలో చేయకూడని ప్రైవేటు పని చేయడం మీరు చూడొచ్చు.. అయితే, ఇదే కోచ్‌లో భారీగా ప్రయాణికులు ఉండడంతో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో పాటించాల్సిన కనీస మర్యాదలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆ జంట చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన మెట్రో రైళ్లలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రయాణిస్తుంటారని.. అలాంటి బహిరంగ ప్రదేశాల్లో కనీస చూసుకోకుండా ఇలా ప్రైవేటు పనులు చేయడం ఎంత వరకు మంచిదని ప్రశ్నిస్తున్నారు.. ఈ ప్రవర్తనలతో ఇతరులకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు.