SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

స్మార్ట్‌ఫోన్ దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.. రైలుతో పాటు వేలాడుతూ ప్రయాణం!

Delhi Train Theft Video: కదులుతున్న రైళులో నుంచి స్మార్ట్‌ఫోన్‌ కొట్టేదమనుకున్న దొంగకి పెద్ద షాక్‌ తగిలింది.. భోగిలో ఉన్న ప్రయాణికులు ఆ దొంగ స్మార్ట్‌ఫోన్‌ను కొట్టేసే క్రమంలో చేతిని పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ అలాగే రైళుతో తర్వాత స్టేషన్‌ వరకు వెళ్లాడు.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 09, 2026, 12:37 PM IST | Updated: Nov 09, 2026, 12:39 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Delhi Train Theft Video: రైళ్లలో కిటికీ దగ్గరే కూర్చునే వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసే ముఠాలు నిత్యం రెచ్చిపోతూ ఉంటాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చేశారు. కదులుతున్న రైలు కిటికీలోంచి.. ప్రయాణికుల చేతిలోని ఉన ఫోన్‌ని లాక్కోవడానికి చేతులు చాచిన.. ఓ దొంగను ప్రయాణికులు సింపుల్‌గా పట్టుకున్నారు. వదిలిపెట్టకుండా.. అలాగే రైలు కిటికీకి వేలాడదీసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్ పరిధిలో కదులుతున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుందట.. రైలు కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుల నుంచి ఖరీదైన ఫోన్లు దొంగిలించేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడట.. బయట నుంచి కిటికీ గ్రిల్స్ మధ్య నుంచి చేతిని లోపలికి దూర్చాడు.. అయితే.. లోపల ఉన్న ప్రయాణికుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి దొంగ చేతిని గట్టిగా పట్టుకుండిపోయాడు.

ఆ రైళు భోగిలో ఉండే ప్రయాణికులు కూడా వెంటనే అప్రమత్తమై.. ఆ దొంగ చేతిని వదలకుండా పట్టుకున్నారు. దీంతో రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ.. ఆ దొంగ రైలు బయట గాలిలోనే వేలాడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది.. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. ప్రయాణికులు పట్టు విడవకపోవడంతో.. తదుపరి స్టేషన్ వచ్చేంత వరకు అతడు అలాగే భయంతో బిక్కుబిక్కుమంటూ రైలుతో పాటు వేలాడుతూ ఉండిపోయాడు..

ఈ మొత్తం ఘటనను బోగీలోని కొందరు ప్రయాణికులు.. తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.. దాదాపు 94 సెకన్ల కలిగిన ఈ వీడియో ప్రస్తుతం  ఎక్స్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. వీడియోలో ప్రయాణికులు కిటికీ దగ్గరే ఉండి.. దొంగను గట్టిగా పట్టుకుని ఉండటం.. బయట అతను రైలును పట్టుకుని.. వేలాడుతూ వేడుకోవడం స్పష్టంగా మీరు ఈ వీడియోలో చూడొచ్చు..  ఢిల్లీలో దొంగను ఇలా పట్టుకున్నాం.. అని ప్రయాణికులు మాట్లాడుకోవడం కూడా వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు.. ఈ వీడియోపై సోషల్‌ మీడియా వినియోగదారులు మిశ్రమంగా స్పందిస్తూ వస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES