SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karnataka Police: కర్ణాటకలో షాకింగ్.. తప్పతాగి రోడ్డుపై పడిపోయిన పోలీసు.. వీడియో వైరల్..

Drunken constable in chitrakoot: కానిస్టేబుల్ దీపక్ ప్రకాశ్ వర్మ తప్పతాగి హైవే పక్కన తలకిందుగా పడిపోయాడు. ఆ మార్గంలో వెళ్తున్న వారు పోలీసు వాలకం చూసి ఆశ్చర్య పోయారు. ఈ వీడియో పై నెట్టింట దుమారం రాజుకుంది.

Written By Inamdar Paresh
Published: Oct 22, 2026, 08:26 AM IST | Updated: Oct 22, 2026, 08:36 AM IST
Image Credit: chitrakoot drunken constable video
Join

Drunken police constable suspended in chitrakoot: సమాజంలో పోలీసులను ఎంతో గౌరవంగా చూస్తారు. శాంతిభద్రతలను కాపాడటం కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తారు.  కొన్నిసందర్భాల్లో పండగలకు, ఇంట్లో వారికి కూడా దూరంగా ఉంటూనే డ్యూటీలు చేస్తారు. అలాంటి డిపార్ట్ మెంట్ కు కొంత మంది పోలీసుల వల్ల చెడ్డపేరు వస్తుంది. ఇటీవల ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారు.

 

 

 మహిళల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తుంటారు. మరికొంత మంది తప్పతాగి న్యూసెన్స్ చేస్తారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటాయి.  ఈక్రమంలో ఒక పోలీసు డ్యటీలో ఉండి తప్పతాగి రోడ్డు మీద బొక్కాబొర్లా పడ్డాడు. కర్ణాటకలోని చిత్రకూట్ లో జరిగిన ఈ  ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.


కర్ణాటకలోని చిత్రకూట్ లో దీపక్ ప్రకాశ్ వర్మ అనే కానిస్టేబుల్  చేసిన పని డిపార్ట్ మెంట్ లో తీవ్ర కలకలంగా మారింది. చిత్రకూట్ లోని   కర్వి కోత్వాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కలుపూర్ పాహి, ఖోహ్ మధ్య హైవే పక్కన హెడ్ కానిస్టేబుల్ దీపక్ ప్రకాష్ వర్మకు పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద డ్యూటీ అప్పగించారు. కానీ దీపక్ ప్రకాశ్ వర్మ మాత్రం డ్యూటీ టైమ్ లో తప్పతాగి తన కుర్చీలో అపస్మారక స్థితిలో పడిపోయాడు.  యూనిఫామ్ లో కూర్చీలోనే తలకిందులుగా కానిస్టేబుల్ పడిపోవడం చూసి ఆ మార్గంలో వెళ్తున్న వారు ఆశ్చర్యపోయారు. 

కానిస్టేబుల్ ను ఎంతగా పిలిచిన ఆయన కనీసం రెస్పాండ్ కాలేదు. పీకల దాక మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇది కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దీనిపై విచారణకు ఆదేశించారు.యూనిఫామ్ లో మద్యం సేవించినందుకు ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES