BOB Recruitment 2026: డిగ్రీ పూర్తి చేసిన వారికి భారీ గుడ్‌న్యూస్.. బ్యాంకు జాబ్ చేయాలని ఎదురు చూస్తున్నవారికి బంపర్ శుభవార్త. మొత్తం 837 పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 46 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, 791 సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనుంది. 2026 నవంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేయాలంటే bankofbaroda.bank.in/career/current opportunities లో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ, ఎంబీఏ అర్హత ఉండాలి. అంతేకాదు పోస్టులకు సంబంధించి ఉద్యోగం అనుభవం ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవీపీ II, ఏవీపీ I, డిప్యూటీ మేనేజర్ పోస్టుల దరఖాస్తు స్వీకరణ నిన్నటి నుంచి మొదలైంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తారు. నవంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు..
బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తు చేసుకోవాలంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, ఉమెన్‌కు కేవలం రూ.175 జీఎస్టీతో కలిపి చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ..
ఏవీపీ II, ఏవీపీ I, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అప్లికేషన్ క్షుణ్నంగా పరిశీలిస్తారు. మొదట ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
వయో పరిమితి..
గ్రూప్ హెడ్.. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి పట్టా పొంది ఉండాలి. 35-50 ఏళ్ల మధ్య ఉండాలి. హెడ్ ఇన్వెస్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ 35-50 ఏళ్ల మధ్య ఉండాలి. టెర్రిటరీ హెడ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ I దరఖాస్తు చేసుకునేవారు 28-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్ మేనేజర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ I పోస్టుకు 26-45 మధ్య ఉండాలి. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, డిప్యూట మేనేజర్ 24-35 మధ్య ఉండాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ 2026 వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి.