SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

DVC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ 2026.. పరీక్ష లేకుండానే ఎంపిక! అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదే!

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (Damodar Valley Corporation – DVC) బంపర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ గేట్‌ 2025 ఆధారంగా 108 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందులో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ తదితర విభాగాల్లో ఈ భర్తీ చేయనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 06, 2026, 04:12 PM IST | Updated: Nov 06, 2026, 04:16 PM IST
Image Credit: DVC Executive Trainee Recruitment 2026:
Join

DVC Executive Trainee Recruitment 2026: దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ అనే సంస్థను 1948 జూలై 7న స్థాపించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ, వరదల నియంత్రణ, సాగునీటి సరఫరా వంటి కీలక బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. అయితే, డీవీసీ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు భర్తీకి శ్రీకారం చుట్టింది.  మొత్తం 108 ఖాళీలను భర్తీ చేయనుంది. గేట్‌ స్కోర్‌ కార్డు 2025 ఆధారంగా భర్తీ చేయనున్నారు. 2026 నవంబర్‌ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.  www.dvc.gov.in ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డీవీసీ స్పెషల్‌ రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబేషన్‌ ఉంటుంది.

అప్లికేషన్‌ ప్రక్రియ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే. బీఈ, బీటెక్‌ లేదా తత్సమాన ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. పే స్కేల్‌ రూ.56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్‌ 6. ఈ ఖాళీలలో ఎక్కువగా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఆ తర్వాత సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనిశర్శిటీ నుంచి పట్టా పొంది ఉండాలి.

వయో పరిమితి..
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయో పరిమితి గరిష్టంగా 29 ఏళ్లు ఉండాలి. ఓబీసీ మూడేళ్ల వయోపరిమితి సడలింపు, ఎస్సీ, ఎస్టీ ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ పదేళ్ల సడలింపు ఉంది.

ఇక ఈ డీవీసీ రిక్రూట్మెంట్‌కు అప్లికేషన్‌ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.300 ఇతరులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నాన్‌ రిఫండబుల్‌. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం గేట్‌ స్కోర్‌ కార్డు ఆధారంగానే ఎంపిక ఉంటుంది. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కూడా చేసిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Read Also: గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇండియన్ బ్యాంక్‌లో 1500 పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇదే!
 

Read Also:  BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES