ఎగ్జిమ్ బ్యాంక్ భారీ నోటిఫికేషన్! మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ లింక్ ఇదే!
ఎక్స్‌పోర్ట్ ఇపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Exim Bank) మొత్తం 120 మేనేజ్‌మెంట్ ట్రైనీ 90, మేనేజర్స్ 30 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. యువ ప్రొఫెషనల్స్ కోసం ఈ బ్యాంకు దరఖాస్తుల స్వీకరణ చేపడుతుంది. చివరి తేదీ డిసెంబర్ 11 ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Exim Bank Recruitment 2026: ఎగ్జిమ్ బ్యాంక్ అనేది భారత ప్రీమియర్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఫైనాన్సింగ్ సంస్థ. ఇందులో ట్రేడ్, ఫైనాన్స్, పాలసీకి సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తారు. ఎగ్జిమ్ బ్యాంకు మొత్తం 120 మేనేజర్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మీరు అర్హులా? కాదా? అనేది నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి తెలుసుకోవచ్చు. ఇందులో ఎంపిక ప్రక్రియ, జీతం, దరఖాస్తు చేసుకునే విధానం కూడా వివరించారు.
ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్‌మెంట ట్రైనీ నోటిఫికేషన్ పోస్టులు..
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 120 ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంకు విడుదల చేసింది. ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీలు భర్తీ చేయను్నారు. ఇక ఎగ్జిమ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ wwww.eximbankindia.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో జాబ్ చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఇది బెస్ట్ నోటిఫికేషన్. 120 ఖాళీలను పోస్టులవారీగా పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది.
ఎగ్జిమ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు చేసుకునే విధానం..
ఎగ్జిమ్ బ్యాంక్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది.
ముందుగ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోంపేజీలో కెరీర్ సెక్షన్ ఎంచుకోండి
అక్కడ ఎగ్జిమ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ సెర్చ్ చేయండి.
ఆ తర్వాత అప్లై ఆన్‌లైన్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియను మీ కనీస వివరాలతో నమోదు చేయండి.
రిజిస్ట్రేషన క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
ఇక అప్లికేషన్ ఫారమ్ మీ పర్సనల్, ఎడ్యుకేషనల్ వివరాలతో నింపండి.
ఫోటోగ్రాఫ్, సిగ్నేచ్, సంబంధిత డాక్యుమెట్‌ను కూడా అప్‌లోడ్ చేయండి.
ఇక ఫీజు చెల్లించి, చివరగా ఒకసారి రివ్యూ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫారమ్ ఎంచుకోండి. ఇప్పుడు రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది.
ఎగ్జిమ్ బ్యాంక్ భారతదేశ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి స్థాపించారు.. ఇది కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే అత్యున్నత ఆర్థిక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రధానంగా భారతీయ వ్యాపారులు విదేశాలకు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి అవసరమైన రుణాలు, క్రెడిట్ సదుపాయాలను ఎగ్జిమ్ బ్యాంక్ అందిస్తుంది.
ఇక ఈ ఎగ్జిమ్ బ్యాంక్ భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికపై మరింత బలోపేతం చేయడానికి ప్రారంభించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ నిల్వలను పెంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దేశీయ పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఎగ్జిమ్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది. అప్పుడప్పుడు సంబంధిత విభాగాల్లో ఎగ్జిమ్ బ్యాంక్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.