Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బుధవారం స్థానిక భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి తీవ్ర కలకలం రేపింది. కుల్గామ్ లోని ఒక సీఆర్పీఎస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని మోటార్ సైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ అనూహ్య దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
ఉగ్రవాదులు కాల్పులు జరిపిన వెంటనే అలర్ట్ అయిన సీఆర్పీఎఫ్ బలగాలు అంతే ధీటుగా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే క్విక్ రియాక్షన్ టీమ్స్ హుటా హుటినా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని.. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని.. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.