PIB Fact Check: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (PSBs)ప్రతి శనివారం అధికారిక సెలవు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఒక గెజెట్ నోటిఫికేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా ఒక ఫేక్ గెజెట్ నోటిఫికేషన్' అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB Fact Check) స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని తెలిపింది. ఎస్బిఐ సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు ప్రకటించిందని ఆ ఫేక్ గెజిట్ లో ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తుంటాయి. అయితే 2015లో రెండు, నాలుగో శనివారాలను ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవులుగా ప్రకటించారు. వైరల్ అవుతున్న పత్రాలను చూసిన వెంటనే నమ్మకూడదని పీఐబీ ప్రజలను కోరింది. కేంద్రానికి సంబంధించిన సమాచారం విషయంలో అధికారిక వర్గాల ద్వారా వివరాలు నిర్ధారించుకున్న అనంతరం షేర్ చేయాలని పిఐబి సూచించింది. అనుమానాస్పద సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కు పంపించాలంటూ స్పష్టం చేసింది.
బ్యాంకులకు ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన ప్రభుత్వం, బ్యాంకింగ్ సేవలకు అంతరాయాలను తగ్గించడానికి సెప్టెంబర్ 27, ఆదివారం నాడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా చర్యలు కూడా తీసుకుంది. ఫలవంతమైన చర్చల అనంతరం, బ్యాంకులు సమ్మెకు వెళ్లాలన్న తమ నిర్ణయాన్ని విరమించుకున్నాయి.
A Gazette circulating on social media , purportedly issued by the Ministry of Finance (Department of Financial Services), claims that the Central Government has declared every Saturday a public holiday for all Public Sector Banks , including SBI.#PIBFactCheck:
❌ The document… pic.twitter.com/ClCqEt2UAX— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2026