• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఫారుఖ్ అబ్దుల్లా నోటి దురుసు.. పాకిస్థాన్ వల్లే కశ్మీర్ ప్రజలకు రక్షణ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఫారుఖ్ అబ్దుల్లా నోటి దురుసు.. పాకిస్థాన్ వల్లే కశ్మీర్ ప్రజలకు రక్షణ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..

Farooq Abdullah Sensational comments on Kashmir: వయసు పెరిగే కొద్ది నేషనల్ కాన్ఫిరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫారుఖ్ అబ్దుల్లాకు మెదడు మోకాళ్లకు జారినట్టు ఉంది. తాజాగా ఈయన పాకిస్థాన్ దయవల్లే కాశ్మీర్ ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 04:31 AM IST|Updated: Oct 25, 2026, 10:39 AM IST
joinshare
ఫారుఖ్ అబ్దుల్లా నోటి దురుసు.. పాకిస్థాన్ వల్లే కశ్మీర్ ప్రజలకు రక్షణ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..
Image Credit: farooq Abdullha Sensational Comments (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
భర్త వివాహేతర సంబంధం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు..!!

భర్త వివాహేతర సంబంధం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు..!!

2

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహం.. !!

3

అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయురాలు బలికావాలా? సంచలన తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు..!!

4

శని-చంద్రుల కలయికతో విష యోగం? అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారికి కీలక సూచనలు!

5

శరత్ పౌర్ణమి ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు అదృష్టం కలిసొస్తుందా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Farooq Abdullah on Kashmir & Pakistan: జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్డుల్లా మరోసారి పాకిస్థాన్ పై తన ప్రేమను చాటుకున్నాడు. ఇక్కడి తిండి తింటూ పాకిస్థాన్ పాట పాడటంపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. తాజాగా ఈయన కశ్మీరీ ప్రజలను  పాకిస్థాన్  కాపాడుతుందనే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ...కశ్మీర్ ఇష్యూను లేవనెత్తుతుందన్నారు. అందువల్లే కశ్మీర్‌లకు రక్షణ లభిస్తుందని వ్యాఖ్యానించారు. ఓ రకంగా పాక్ ఇలా చేయడం వల్లే భారత్ ప్రభుత్వం కశ్మీర్‌లకు రక్షన కల్పిస్తుందన్నారు. ఓ రకంగా కశ్మీరుల బతుకున్నది  పాక్ చలువే అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు కశ్మీర్‌ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి సరైన ఉద్దేశ్యాలు లేవని చెప్పుకొచ్చారు.

శనివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఫారుఖ్ అబ్దుల్లా కశ్మీర్ పై ఈ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరులకు  భారత ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చ లేదన్నారు. మీకు పోరాడే దైర్యం ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే భారత్ ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. ఇక పాకిస్థాన్ మాత్రం ప్రతి అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదని చెబుతూనే కశ్మీర్ అంశాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తుందన్నారు.

గాంధీ, నెహ్రూల వల్లే జమ్మూ కశ్మీర్ భారత్‌లో విలీనం.. 
మనం భారతీయలుం కాదని నేను కానీ.. మా పార్టీ ఎన్నడూ చెప్పలేదన్నారు. మహాత్మ గాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌లు తీసుకున్న  చొరవ వల్ల జమ్మూ కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యిందన్నారు. కేవలం అధికారం కోసం హిందువులు, ముస్లిములు పరస్పరం వ్యతిరేకించుకునే రోజు వస్తుందని నేను అనుకోలేదన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్‌డోజర్ల విధానానికి వ్యతిరేకంగా ముస్లిమ్స్ అందరు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. ఫారుఖ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది.

కశ్మీర్‌ను  పీవోజేకేతో పోల్చి చూడండి అన్న భారతీయ జనతా పార్టీ..

మరోవైపు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశారని.. దమ్ము ఉంటే కశ్మీర్‌లో జరిగిన అభివృద్దిని పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ప్రాంతాలతో పోల్చి చూడాలన్నారు. జమ్మూ కశ్మీర్‌ను ఆర్టికల్ 370 ద్వారా మీ కబంధ హస్తాల్లో బంధించిన మీరు.. మాకు నీతులు చెబుతారా అని ఫారుఖ్‌కు గట్టి సమాధానమే ఇచ్చారు. దుర్మార్గమైన ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం రాగానే మార్చారన్నారు.  మా ప్రభుత్వం కశ్మీర్‌ను ఏ రకంగా అభివృద్ధి చేసిన విషయం మీరు  కళ్లద్దాలు పెట్టుకొని చూస్తే  తెలుస్తుందన్నారు. విద్వేషాన్ని రెచ్చగొట్టేది  మీరే.  మీ వల్లే కశ్మీర్‌లో అశాంతి రాజ్యమేలిందన్నారు. ఇక   మా బుల్జోజర్లు అవినీతి, అక్రమాలు, నేరాలు చేసిన వాళ్ల ఇళ్లపైకి వెళుతుందన్నారు. ఇందులో తర, తమ బేధం లేదన్నారు.  ఇక పీవోజేకేలో ముస్లిమ్స్‌ పరిస్థితి చూడండి. ఇక్కడ స్వేచ్ఛగా ఉన్న కశ్మీరీ ప్రజలు అనువిస్తున్న స్వేచ్ఛను చూడండిని బీజేపీ నేతలు గట్టిగానే ఇచ్చిపడేశారు.  

మరోవైపు ఫరూఖ్ అబ్దుల్లా  చేసిన వ్యాఖ్యలు పూర్తిగా దేశ వ్యతిరేకం అని బీజేపీ నేతలు  అన్నారు. ఆయన పై దేశ ద్రోహ కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఫరూక్ అబ్దుల్లా భారత  రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడరన్నారు. ఇక అబ్దుల్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ మౌనం వహించింది. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పి ఉండొచ్చు. భారత్ ఇంటర్నల్ వ్యవహారాల్లో వేరేవాళ్ల జోక్యాన్ని సహించేది లేదంటూ  ఆ తర్వాత కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
BJP
PM Modi