SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చేతిలో కాలుతున్న 1000 వాలా.. అంకుల్ చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే!

Diwali Stunt Video: ఓ అంకుల్‌ చేతిలో 1000 వాలా పట్టుకుని స్టంట్స్‌ చేస్తున్న దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 12:47 PM IST | Updated: Nov 10, 2026, 12:49 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Diwali Stunt Video: దీపావళి పండుగ రోజు బాణసంచా కాల్చే సమయంలో కొందరు చేసే సాహసాలు ఒక్కోసారి నవ్వు పుట్టిస్తే.. మరికొన్ని సార్లు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి.. తాజాగా ఒక పెద్దాయన బాణసంచాతో చేసిన అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. చేతిలో కాలుతున్న 1000 వాలా పట్టుకుని ఆయన చేసిన హెలికాప్టర్ స్టంట్‌ను ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ గళ్లీలో రాత్రి పూట తీసినట్లు తెలుస్తోంది. దీపావళి సంబరాల్లో భాగంగా అంతా సందడిగా ఉండగా.. ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకున్న ఒక అంకుల్ చేతిలో 1000 వాలా వెలిగించుకుని ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా గమనించవచ్చు. సాధారణంగా నిప్పు పెట్టిన వెంటనే దూరంగా పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఈ అంకుల్‌ మాత్రం ఏమాత్రం బయపడకుండా ఆ టపాకాయను చేతిలోనే పట్టుకుని వేగంగా గిరగిరా తిప్పడం మొదలు పెట్టాడు..

ఆ 100 వాలా నుంచి నిప్పురవ్వలు హెలికాప్టర్ రెక్కల తరహాలో నలుదిక్కులా వస్తున్నప్పటికీ.. అతను మాత్రం ఎలాంటి భయం లేకుండా ఉండడం మీరు చూడొచ్చు.. చుట్టుపక్కల ఉన్నవారు భయంతో చెవులు మూసుకుని పరుగులు తీయగా.. మరికొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్‌ చేయడం మీరు చూడొచ్చు. ఈ వక్తి కళ్లలో కనీసం భయం కనిపించకుండా ఉండడం.. అతని కాన్ఫిడెన్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. అంతే ఇప్పుడు ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.. దీనిపై స్పందించిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ వస్తున్నారు.  ఆ అంకుల్‌కి చేతి వేళ్లు ఇంకా ఉన్నాయా? అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరికొంతమంది అకుంల్‌ మీరు కేక అంటూ కామెంట్స్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే, ఈ సహాసాలు చూడటానికి ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. ఇది ప్రాణాలకే ప్రమాదకరమని పలువురు హెచ్చరిస్తూ వస్తున్నారు. వెలుగుతున్న బాణసంచాను చేతిలో పట్టుకోవడం లేదా గాల్లో తిప్పడం వల్ల అవి చేతిలోనే పేలిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల చేతులు కాలిపోవడం, శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడటంతో పాటు కంటిచూపు దెబ్బతినే ఛాన్స్‌ కూడా ఉందని వారంటున్నారు. అయితే, ఈ ఘటన పంజాబ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES