• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు..!!

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు..!!

Telangana Job Notifications: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.

Written ByBhoomi
Published: Nov 10, 2026, 01:59 PM IST|Updated: Nov 10, 2026, 02:01 PM IST
joinshare
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు..!!
Image Credit: Telangana Job Notifications:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ మారాయి.. రోజువారీ లిమిట్ ఎంతంటే?

పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ మారాయి.. రోజువారీ లిమిట్ ఎంతంటే?

2

జపాన్‌లో వింత స్లీపింగ్ కాంపిటీషన్.. 90 నిమిషాలు నిద్రపోతే లక్షల రూపాయల బహుమతి!

3

శ్రీశైలంలో కార్తీక మాస శోభ.. ధ్వజస్తంభంపై ఆకాశదీపం ఆవిష్కరణ.. డిసెంబర్ 9 వరకు ప్రత్యేక పూజలు!

4

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు..!!

5

ఆటో నడిపే తాత ఇంగ్లీష్ చూశారా? ఫ్లూయెన్సీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Job Notifications: తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,929 పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు పూర్తి కసరత్తు ప్రారంభించారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 996 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మిగిలిన 1,933 పోస్టులకు త్వరలోనే అనుమతులు లభించనున్నాయి.

ఆర్థిక శాఖ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత, ఈ పోస్టులన్నింటినీ దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీ బాధ్యతను ప్రధానంగా 'తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MRB)' చేపట్టనుండగా.. కేవలం జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం 'తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)' ద్వారా భర్తీ చేయనున్నారు.

మొదటి విడతలో ఆర్థిక శాఖ ఆమోదం పొందిన 996 పోస్టుల వివరాలు:
మొత్తం 996 ఖాళీలకు గాను వివిధ విభాగాల్లోని పోస్టులు ఇలా ఉన్నాయి:

సివిల్ అసిస్టెంట్ సర్జన్లు: 198

ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 308

టెక్నీషియన్లు: 290

బయోమెడికల్ ఇంజినీర్లు: 14

ఫిజియోథెరపిస్టులు: 46

రేడియోగ్రాఫర్లు: 11

ల్యాబ్ టెక్నీషియన్లు: 73

ఏఎన్ఎంలు: 54

ఈ ఉద్యోగాలను వైద్య విధాన పరిషత్ (TVVP), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్), ఆయుష్, ఎంఎన్‌జే, ఐపీఎం తదితర విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు.

ఆమోదం లభించాల్సిన మిగిలిన 1,933 పోస్టుల వివరాలు:
ఇంకా ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సిన మిగతా పోస్టుల్లో వైద్యులు, బోధనా సిబ్బంది, నర్సింగ్,  పరిపాలనా విభాగాలు ఉన్నాయి:

అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 716

సివిల్ అసిస్టెంట్ సర్జన్లు: 422

స్టాఫ్ నర్సులు: 194

ల్యాబ్ టెక్నీషియన్లు: 96

జూనియర్ అసిస్టెంట్లు: 119

మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు: 238
వీటితో పాటు ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 134, వైద్య విద్య సంచాలకుల పరిధిలో 288 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కొనసాగుతున్న ఇతర నియామకాలు:
ఇదిలా ఉంటే, వైద్యారోగ్య శాఖలో అంతకుముందు ప్రకటించిన 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే వివిధ దశల్లో ఉంది.

ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని 1,931 ఎంపీహెచ్‌ఏ (మహిళ) పోస్టుల ప్రక్రియ పూర్తయి తుది ఎంపిక జాబితా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఫార్మసిస్ట్ గ్రేడ్-2కు సంబంధించిన 732 పోస్టుల భర్తీ చివరి దశకు చేరుకుంది.

48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి 4 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలన, వెయిటేజీ మార్కుల లెక్కింపు పనులు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖలోనే ఏకంగా 13,401 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా 2,929 పోస్టుల చేరికతో వైద్య రంగంలో నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని పోస్టులకు ఒకేసారి కాకుండా, అనుమతులు వచ్చిన వాటిని బట్టి విడతలవారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 

Also Read: 

 

 

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు  ఆవిరి..!!

 

 

 

 

 

 

తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?

 

 

 

 

 

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే..!!

 

 

 

 

 

 

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs
Govt Jobs
Revanth Reddy
Telangana News