సోనియా పై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ, నటి కంగనా పై పోలీసుల FIR..
FIR Filed on Kangana: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షరాలు.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత సోనియా గాంధీ రాసిన ఆత్మ కథ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాదు వివాదాస్పదం అవుతుంది. అందులో సోనియా తనకు తమకు పార్టీకి అవసరమైన వాటినే హైలెట్ చేసిందనే వాదనలు ఉన్నాయి. తమకు ఇబ్బంది కరంగా ఉన్న అంశాలను తొక్కిపెట్టిందనే బీజేపీ నాయకులు చెబుతున్న మాట. ఇక సోనియా గాంధీ.. విదేశాల నుంచి మన దేశానికి చెందిన శత్రువు గూఢచారి అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పద మయ్యాయి.
Sonia Gandhi Vs Kangana: సోనియా గాంధీ రాసిన పుస్తకం ‘బీలాంగింగ్ జర్నీ ఆఫ్ లవ్’ వివాదాస్పదం అవుతుంది. ఇందులో ఆమె బోఫోర్స్ కుంభకోణం, భోపాల్ కార్బైడ్ గ్యాస్ లీక్ నిందితుడు ఖత్రోచి భారత్ నుంచి పారిపోవడం వెనక అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ప్రమేయం ఉందనే విషయాన్ని తొక్కి పెట్టిందన్నారు. మరోవైపు బాబ్రీ కూల్చివేతపై కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. కశ్మీర్‌లో ఉగ్రవాదులు .. పండితులను ఊచకోత కోసినపుడు ఎందుకు కన్నీళ్లు రాలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. గుజరాత్ గోద్రా అల్లర్లను ప్రస్తావించిన సోనియమ్మ.. కశ్మీర్‌లో హిందువుల ఊచకోతతో పాటు సిక్కు అల్లర్లు సహా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన గొడవలపై ఎందుకు ప్రశ్నించలేదనేది బీజేపీ నాయకులు వేస్తోన్న ప్రశ్న. ఇక సోనియా గాంధీ విదేశీ ఏజెంట్ అంటూ బీజేపీ ఫైర్ బ్రాండ్ సిమ్లా ఎంపీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
సిమ్లాకు చెందిన అతుల్ శర్మ డీజీపీ అశోక్ తివారీకి ఫిర్యాదు..
ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిననటు వంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సిమ్లాకు చెందిన అతుల్ శర్మ ఈ వ్యవహారంపై డీజీపీ అశోక్ తివారీకి ఫిర్యాదు చేశారు. కంగనా వ్యాఖ్యలు విద్వేషాలను ప్రోత్సహించేలా, రాజ్యాంగంపై విధేయతను ప్రశ్నించేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్ణీత కాలపరిమితిలో విచారణ జరపాలని కోరారు.
బీఎన్ఎస్ లోని సెక్షన్ 353, 356, 196 కేసు ..
కంగనా సోషల్ మీడియా పోస్టుల్లో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీల మరణాలపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. సోనియా గాంధీని అనుమానాస్పద విదేశీయురాలిగా చిత్రీకరించారని ఆరోపించారు. ఆధారాలు లేని ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాశాంతికి విఘాతం కలిగించే ప్రమాదం ఉందని తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సిమ్లా పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్ఎస్పీ గౌరవ్ సింగ్ ధ్రువీకరించారు. బీఎన్ఎస్ లోని సెక్షన్ 353, 356, 196 కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.