SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karmabhoomi Fire Express: కర్మభూమి ఎక్స్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు భోగీలు దగ్దం.. వీడియో..

Fire in Karmabhoomi Express: పంజాబ్ లోని రాజ్ పురా వద్దకు రైలురాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయందోళనలతో బైటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనపై అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Written By Inamdar Paresh
Published: Nov 06, 2026, 03:30 PM IST | Updated: Nov 06, 2026, 03:46 PM IST
Image Credit: karmabhoomi express fire accident
Join

Fire Accident in karmabhoomi Express: అమృత్ సర్ నుంచి జల్ఫాయ్ గుడికి వెళ్తున్న కర్మభూమి ఎక్స్ ప్రెస్ లో రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో రైలును ఆపి ప్రయాణికులు దాని నుంచి బైటకు దూకేశారు. చూస్తుంగానే మంటలు నాలుగు భోగీలకు వ్యాపించాయి. కోచ్ అంతట నల్లని పొగలు అలుముకున్నాయి.  ట్రైన్  పంజాబ్ లోని రాజ్ పురా వద్దకు రాగానే మంటలు వ్యాపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. 

 

 వెంటనే స్థానికుల సమాచారంతో అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ట్రైన్ లో విద్యుత్ అఘాతంతో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత మంత టెన్షన్ వాతావరణం నెలకొంది. తొలుత రైలులోని ఒక భోగి లో మంటలు అంటుకున్నాయని, అవి క్రమంగా  మిగతా భోగీలకు వ్యాపించాయని దీంతో అప్రమత్తమైన కొంత మంది ప్రయాణికులు చైన్ ను లాగడటంతో అందరు ట్రైన్ నుంచి బైటకు దూకేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అంతే కాకుండా ఆస్తినష్టంపై విచారణ కోసం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES