SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాక్‌పిట్‌లోకి గొడ్డలి ఎలా వచ్చింది? ఇండియన్ పైలట్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

Flydubai Pilot Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ లో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై.. కో పైలట్ గొడ్డలితో దాడి చేసి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాధారణంగా ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది చిన్న కత్తెరలు, బ్లేడ్లను కూడా లోపలికి అనుమతించరు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 02, 2026, 10:12 AM IST | Updated: Oct 02, 2026, 10:14 AM IST
Image Credit: Flydubai Pilot Attack:
Join

Flydubai Pilot Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ లో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై.. కో పైలట్ గొడ్డలితో దాడి చేసి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాధారణంగా ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది చిన్న కత్తెరలు, బ్లేడ్లను కూడా లోపలికి అనుమతించరు. అలాంటిది.. ఏకంగా ఫ్లైట్ కాక్ పిట్ లోకి గొడ్డలి ఎలా చేరిందన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తింది. అయితే దీని వెనకున్న అసలు కారణం మరింత ఆశ్చర్యపరిచేలా ఉంది.

సెప్టెంబర్ 30వ తేదీన దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఎఫ్ జెడ్ 1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒమన్ కు చెందిన కో పైలట్ భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై హఠాత్తుగా దాడికి దిగాడు. దీంతో విమానం నియంత్రణ కోల్పోయింది. వేగంగా కిందికి దూసుకురావడం మొదలుపెట్టింది. అలర్ట్ అయిన కెప్టెన్ స్మిత్.. ప్రయాణికులు, సిబ్బంది సాయంతో కో పైలట్ ను నిలువరించి పెను ప్రమాదాన్ని నివారించారు.

ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫాక్స్ న్యూస్ తో మాట్లాడారు. పైలట్ పై కత్తితో లేదా గొడ్డలితో దాడి జరిగిందన్న అనుమానం ఉంది. అతనికి తీవ్ర రక్తస్రావం అయ్యింది.. అని చెప్పడంతో ఈ గొడ్డలి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ గొడ్డలిని ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందిని దాటించి లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిజినెస్ ఫ్లైట్లలో అత్యవసర పరిస్థితుల కోసం క్రాష్ యాక్స్ లేదా అలాంటి పదునైన పరికరం కాక్ పిట్ లోనే అందుబాటులో ఉంటుంది.

యూఏఈ ఏవియేషన్ రూల్స్ ప్రకారం.. 5,700 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న 9మంది కంటే ఎక్కువ ప్రయాణికులున్న ప్రతి విమానం కాక్ పిట్ లో తప్పనిసరిగా ఒక క్రాష్ యాక్స్ లేదా క్రోబార్ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్యానెళ్లను పగలగొట్టడానికి.. ప్రమాద సమయంలో తలుపులు తెరచుకోకపోతే వాటిని ఛేదించడానికి అత్యవసర మార్గాలను ఏర్పాటు చేసేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. అంటే ఫ్లైట్ లో గొడ్డలి ఉండటం భద్రతా వైఫల్యం కాదని.. అది నిబంధనల ప్రకారం తప్పనిసరి అని అంటున్నారు అధికారులు.

అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ జిహాదీ ఉగ్రదాడికి యత్నంగా పరిగణిస్తోంది. దాడికి పాల్పడిన ఒమన్ కో పైలట్ కు రాడికల్ ఇస్లామిక్ భావజాలం నూరిపోశారంటూ ఆరోపణలు చేస్తోంది. అయితే విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్ మాత్రం కాక్ పిట్ లో ఘర్షణ జరిగిందని ధ్రువీకరిస్తూనే.. దర్యాప్తు పూర్తవ్వకముందే ఊహాగానాలకు వెళ్లవద్దని సూచిస్తోంది. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ దీన్ని భద్రతా సంఘటనగా పేర్కొంటూ దర్యాప్తు చేపట్టింది.

ప్రాణాలను కాపాడటానికి విమానంలో అమర్చిన అత్యవసర పరికరం దాడి ఆయుధంగా మారిందన్నదే ఈ ఘటనలోని ప్రధాన వాదన. ప్రయాణికుల్లాగే, పైలట్లు కూడా క్షుణ్ణమైన భద్రతా తనిఖీల తర్వాతే విమానం ఎక్కాల్సి ఉంటుంది. కానీ, విమానంలో అత్యంత ముఖ్యమైన భాగాలైన ఈ పరికరాలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారగలవని ఈ ఘటన రుజువు చేస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES