• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..

CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..

Cockroach Janta Party: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోసం కాక్రోచ్‌ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. SIRను వెంటనే నిలిపివేయాలని, ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకత కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 2న సందర్భంగా ఇవాళ ముంబై వేదికగా ఆందోళనలకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ ఉద్యమానికి ముందు హైడ్రామా నడిచింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 02, 2026, 11:27 AM IST|Updated: Oct 02, 2026, 11:30 AM IST
joinshare
CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..
Image Credit: CJP Protest (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
"నా వల్ల ఏమీ కాదు" అనుకునేవారి కోసమే ఈ కథ.. మీ అసలైన శక్తి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

"నా వల్ల ఏమీ కాదు" అనుకునేవారి కోసమే ఈ కథ.. మీ అసలైన శక్తి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

2

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినా‌ష్‌కు ట్విస్ట్..నోటీసులు జారీ చేసిన ఈడీ..విచారణకు రావాల్సిందే!

3

నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

4

CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..

5

AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CJP Protest: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్లకార్డులు పట్టుకుని మెరైన్‌ డ్రైవ్‌ వద్ద దీప్కే, ఆయన మద్దతుదారులు కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే దీప్కేను అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు.

మెరైన్‌ డ్రైవ్‌ వద్ద దీప్కే ప్రజలను కలుస్తూ, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఒక మహిళా పోలీసు అధికారి ఆయనను గుర్తింపు, స్వస్థలం వంటి వివరాలు అడిగిన అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే దీప్కే మాత్రం భిన్నంగా స్పందించారు.

తనను ఓ మహిళా పోలీసు అధికారి ‘టీ తాగుదాం రండి’ అంటూ వెంట తీసుకెళ్లారని, అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో కొంతసేపు ఉంచి వెళ్లిపోవచ్చని చెప్పారని తెలిపారు. తన సమయాన్ని వృథా చేసేందుకే ఇలా చేశారని ఆరోపించారు. తర్వాత చెంబూర్‌లోని అంబేడ్కర్‌ హాస్టల్‌లో విద్యార్థులను కలిసినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

ముంబైలోని శివాజీ పార్క్‌ వద్ద భారీ నిరసన నిర్వహించాలని సీజేపీ నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. శివాజీ పార్క్‌ పరిధిలోని నిబంధనలు, ట్రాఫిక్‌ రద్దీ, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందుల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ఇవాళ్టి నిరసనలపై ఉత్కంఠ నెలకొంది.

కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రధానంగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, SIR ప్రక్రియ నిలిపివేత, ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు వంటి డిమాండ్లతో ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కుకు భంగం కలగకుండా చూడాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్‌ కుమార్‌ తప్పుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. ముంబైలో ప్రారంభమయ్యే నిరసనలు అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.

ఇదే అంశంపై.. కాంగ్రెస్‌ పార్టీ కూడా విడిగా ఆందోళనలకు సిద్ధమైంది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. సర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టబోతోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ దాకా సేవ్‌ డెమొక్రసీ మార్చ్‌లను నిర్వహించనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్‌ సహా వివిధ రాష్ట్రాల పార్టీ విభాగాలు ఈ అంశంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రత, ఓటర్ల జాబితా నిర్వహణపై సమగ్ర చర్చ అవసరమని కాంగ్రెస్‌ పేర్కొంటోంది.

మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం SIR ప్రక్రియ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందని చెబుతోంది. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శక విధానాలు పాటిస్తున్నామని స్పష్టం చేస్తోంది. సీజేపీ ఉద్యమ పిలుపు, కాంగ్రెస్‌ నిరసనలతో SIR అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సీఈసీ రాజీనామా డిమాండ్‌, ఎన్నికల ప్రక్రియపై కొనసాగుతున్న వివాదం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Delhi
Telugu News