SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కరెంట్ బిల్లు సున్నా చేసే సూపర్ స్కీమ్.. రూ.78 వేల సబ్సిడీతో ఎలా పొందాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మహిళలు, రైతులకు పెద్దపీట వేసింది. అయితే, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎంతో ఉపయోగకరమైన పథకాలను కూడా ప్రకటించింది. పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన. ఈ పథకం కింద ఉచితంగా కరెంటును పొందవచ్చు. దీంతో మీ కరెంటు బిల్‌ జీరో వస్తుంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 09, 2026, 04:27 PM IST | Updated: Oct 09, 2026, 04:31 PM IST
Image Credit: PM Surya Ghar Muft Bijli Yojana
Join

PM Surya Ghar Muft Bijli Yojana: ప్రస్తుతం ఎండల తీవ్రత తగ్గనేలేదు. ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పటికీ కూడా ఏసీలు, కూలర్‌లు రన్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే, దీన్ని బట్టి కరెంటు బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజన పథకం. దీని ద్వారా మీ కరెంటు బిల్లు జీరో వస్తుంది. ఇందులో మీరు దాదారు రూ.78 వేల వరకు సబ్సిడీ కూడా పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఉచితంగా కరెంటును అందిస్తుంది. 300 యూనిట్‌ల వరకు ఉచితంగా కరెంటును అందిస్తుంది. ఈ పథకంలో సబ్సిడీ కూడా పొందుతారు. దీంతో మీ కరెంటు బిల్లు కూడా జీరో అవుతుంది.

ఎక్స్‌ వేధికగా ఎంపీ ప్రభుత్వం షేర్‌ చేసిన వివరాలు ప్రకారం పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజన ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 60 లక్షల మది లబ్ది పొందుతున్నారు. ఇప్పటికీ 86.24 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ పథకం ద్వారా వారికి బ్యాంకు నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఉచితంగా దేశవ్యాప్తంగా కరెంటును అందించడం, ప్రజలపై బిల్లు భారం పడకుండా కాపాడటం.

పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజన ద్వారా సబ్సిడీ కూడా పొందుతారు. ఒక్క కిలోవాట్‌ సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.30,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండు కిలోవాట్స్‌కు రూ.60,000 పొందుతారు. ఒకవేళ మీ ఇంటి రూఫ్‌టాప్‌పై మూడు కిలోవాట్స్‌ లేదా అంతకంటే ఎక్కువ ఏర్పాటు చేసుకుంటే ఏకంగా రూ.78 వేల వరకు సబ్సిడీ పొందుతారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేర్వేరుగా సబ్సిడీ పొందుతారు.

 

 

పీఎం సూర్య ఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజనకు దరఖాస్తు చేసుకునే విధానం..
పీఎం సూర్య ఘర్‌: ముఫ్తీ బిజిలీ యోజనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ https://pmsuryaghar.gov.in/ లో మీ ఇంటి కరెంటు కనెక్షన్‌ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.  మీ ఇంటి అడ్రస్‌, కన్స్యూమర్‌ ఖాతా నెంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత 'అప్లై లింక్‌'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత రూఫ్‌టాప్‌ సోలార్‌ అప్లికేషన్‌ కూడా ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్‌ ఒక్కసారి దరఖాస్తు చేస్తే పోర్టల్‌లో అధికారిక వెండర్‌ వివరాలను కూడా ఇస్తారు.  వెండార్‌ను కాంటాక్ట్‌ చేస్తే ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

Read Also: చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES