SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మె.. యువకుడి చేతిని మింగేందుకు ప్రయత్నించిన భారీ కొండచిలువ.. వీడియో!

Giant Python Video: తాజాగా సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన ఒక కొండచిలువ యువకుడి చేతిని మింగేసేందుకు ప్రయత్నిస్తున్న ఘటన విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆ యువకుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పాము ఏ మాత్రం తన పట్టును వదిలిపెట్టలేక పోతోంది..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 02:28 PM IST | Updated: Nov 01, 2026, 02:30 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Giant Python Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. ఆజాగా ఇంటర్నెట్లో అలాంటి వీడియోని వైరల్ అవుతూ అందరికీ భయం పుట్టించేలా చేస్తోంది. ఒక భారీ సైజులో ఉన్న కొండచిలువ.. మనిషి చేతిని అమాంతం నోట్లోకి లాగేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు instagramతో పాటు ఇతర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ వీడియో క్లిప్పుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక యువకుడు తన ఎదురుగా ఉన్న భారీ కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. అది ఊహించని విధంగా ఒక్కసారిగా అతనిపై తిరగబడి.. అతని చేతిని నోట్లోకి లాగేసుకొని మింగేసే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఈ వీడియోని ఎవరు తీశారో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది..

ఈ వీడియోలో చేయి క్రమంగా పాము నోట్లోకి వెళుతుండడంతో ఆ యువకుడు తీవ్రభయాందోళనతో అతని చేతు అతను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ భయంకరమైన పాము పట్టు నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. మరో చేతితో ఆ కొండచిలువ తలభాగాన్ని బలంగా కొడుతూ.. దాని దవడల నుంచి చేతిని బయటకు లాగేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా అతని దగ్గర ఉన్న ఒక పదునైన కత్తితో దాడి చేసేందుకు కూడా ఎంతగానో ప్రయత్నించడం ఈ వీడియోలో చూడొచ్చు..

ఈ వీడియో సోషల్ మీడియాలో వేలాది వ్యూస్ తో పాటు లైకులను సొంతం చేసుకుంది. దీనిపై వినియోగదారులు వివిధ వర్గాలుగా విడిపోయి కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. కొందరు సాధారణంగా కొండచిలువలు తమ ఆహారాన్ని బంధించి మింగేసే క్రమంలో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాయని కామెంట్లు పెడుతూ ఉంటే.. మరి కొంతమంది ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా లేటెస్ట్ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించారని కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల కాలంలో వ్యూస్ సంపాదించుకోవడానికి చాలామంది ఇలాంటి వీడియోలు పెడుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES