Singer Jhansi Remuneration: బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండగా.. ఈ సీజన్‌లో కీలకమైన 8వ వారంలో ఎలిమినేషన్ అత్యంత ఉత్కంఠగా జరిగింది. ఎలిమినేషన్‌లో అనూహ్యంగా తెలంగాణకు చెందిన సింగర్ ఝాన్సీ ఎలిమినేషన్ అయ్యారు. అగ్నిపరీక్షకు ఎంపికై అనంతరం నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ.. 8 వారాల పాటు హౌస్‌లో కొనసాగి బయటకు వచ్చారు. ఇన్నాళ్లు బిగ్‌బాస్‌లో కొనసాగిన ఆమె ఎంత డబ్బులు తీసుకున్నారో తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో సింగర్ ఝాన్సీ ప్రయాణం అందరి కంటే ప్రత్యేకమైనది. ఆటలో ఎంత స్ట్రాంగ్‌గా ఆడుతుందో.. బంధాల విషయానికి వస్తే అంతే స్వచ్ఛమైన ప్రాణం పెడుతుందని ఝాన్సీ మరోసారి నిరూపించింది. సుధీర్‌తో తనకున్న ఎమోషనల్ బాండింగ్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఎలిమినేషన్ టాస్క్‌లో సుధీర్ ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే ఝాన్సీ గుండె పగిలిపోయింది. గేమ్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ పక్కన పెట్టి తన ప్రాణ స్నేహితుడు దూరమవుతున్నాడనే బాధతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఏడ్చి వదిలేసే రకం కాదని.. తన వాళ్ల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే ధీరురాలుగా ఝాన్సీ నిరూపించింది. ముకేష్ పవర్‌తో తన ఎలిమినేషన్ పవర్ కార్డ్ మళ్లీ రివైవ్ అవ్వడమే ఆలస్యం.. సెకండ్ కూడా ఆలోచించకుండా తన పవర్‌ను సుధీర్‌ను కాపాడటానికి ఉపయోగించింది. ఆ పవర్ తన సేఫ్టీ కోసం వాడుకుని ఉంటే ఝాన్సీ ఇంకా ఎలిమినేట్ కాకుండా సేఫ్‌గా ఉండేదేమో, కానీ ఆమెకు తన కంటే తన స్నేహితుడే ముఖ్యం అని నిరూపించింది.
తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా సుధీర్‌కు తక్కువ ఓట్లు పడగా.. దీంతో అతడిని ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌తో సుధీర్‌ను సేవ్ చేశాడు. సింగర్ ఝాన్సీ తన చేతిలో ఉన్న సేవింగ్ పవర్‌ను పోగోట్టుకుపోవడంతో అది ఆమెకు శాపంగా మారింది. ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఝాన్సీ బిగ్‌బాస్ హౌస్‌ను వీడింది.
అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి మెయిన్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో 8 వారాలు కొనసాగిన సింగర్ ఝాన్సీ భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది. కామనర్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మారడంతో సెలబ్రిటీల కన్నా తక్కువగానే సింగర్ ఝాన్సీకి సంపాదన వచ్చింది. కామనర్ కోటాలో వారానికి సుమారు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు పారితోషికం లభించినట్లు సమాచారం. ఎనిమిది వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగడంతో సుమారు రూ.5.60 నుంచి 6 లక్షల వరకు పారితోషికం ఝాన్సీకి దక్కనుందని తెలుస్తోంది. అగ్నిపరీక్షలో ఉన్న సమయంలో మరో రూ.50 వేలు సింగర్ ఝాన్సీ అదనంగా పొందినట్లు సమాచారం.