HAL Notification 2026: HAL నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం 150 పోస్టుల కోసం దరఖాస్తులు నిన్నటి నుండి ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
ఈ రిక్రూట్‌మెంట్‌కు డిగ్రీ తప్పనిసరి. అభ్యర్థులు తప్పనిసరిగా రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లుగా ఉండగా, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, PwBD అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు వివరాలను జాగ్రత్తగా నింపాలి, లేనిపక్షంలో దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులు రూ. 500తో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC, ST, PwBD అభ్యర్థులకు ఎటువంటి రుసుము ఉండదు.
ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం లభిస్తుంది. ట్రైనీ సమయంలో రూ. 30,000 జీతంతో పాటు DA, హౌస్ రెంట్ అలవెన్స్, పెర్ఫార్మెన్స్ బోనస్, మెడికల్ ఫెసిలిటీ, PF, గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి. రెండేళ్ల తర్వాత, మూడవ సంవత్సరం నుండి 3 శాతం ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు HAL అధికారిక వెబ్‌సైట్ https://hal-india.co.in/ను సందర్శించి, నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది, వివరాలు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.